Devotional

Dharmasandehalu:అష్టైశ్వర్యాలు కలగాలంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి… మీరు ఉంటున్నారా..

Dharmasandehalu:అష్టైశ్వర్యాలు కలగాలంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి… మీరు ఉంటున్నారా.. మనం నివశించే ఇంటి విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. దానివలన మన జీవితం ఎంతో ఆనందంగా, సిరిసంపదలతో ఉంటుంది.అవేమిటో తెలుసుకుందాం…

1.మనం నివశించే ఇంటి సింహ ద్వారం, మన పేరుని బట్టి లేదా మనం పుట్టిన తేదీనిబట్టి మనకు అనుకూలమైన సింహ ద్వారం లో ఉండాలి. అలా ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. మనకి నప్పని సింహాద్వారంలో ఉండటం వలన ఆర్ధికంగా, ఆరోగ్యంగా అన్ని సమస్యలు వస్తాయి.

2.అలాగే ఇంట్లో గోడలు బాగా ఉన్న ఇంట్లో ఉండాలి. అలా కాదని గోడలు బీట్లు ఉన్న ఇంట్లో ఉంటె, ఇక ఆ ఇంట్లో ఆనందం అనేది ఉండదు.

3.ఇంట్లో పావురాలు గూళ్ళు కట్టకూడదు. అలాగే గబ్బిలాలు తిరగకూడదు. దీని వలన ఆ ఇంటి యజమానికి ఆయుష్షు తగ్గుతుంది.

4.ఆగ్నేయంలో వంటగది ఉంటె, ఆ ఇంట్లో వాళ్లకి ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ఉంటుంది.

5.ఉత్తరంలో నీటి కుళాయి, లేదా నీటి బిందెలు అయినా పెట్టుకుంటే మంచిది.

6.ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా, పాజటీవ్ ఎనర్జీ రావాలంటే తులసి మొక్కను పెంచాలి.

7.సింహ ద్వారానికి అటు ఇటు కిటికీలు ఉండాలి. లేదంటే కనీసం ఒక వైపైనా కిటికీ ఉండాలి. ఇలా ఉండటం వలన ఐశ్వర్యం కలుగుతుంది.

8.ఇంట్లోకి గాలి వెలుతురు ప్రవేశించాలి. అలా లేని ఇంట్లో ఉండటం మంచిది కాదు.

9.ఇంట్లో బూజులు ఉండకూడదు. ప్రతీ బుధవారం ఇంటిని శుభ్రపరచుకుంటే మంచిది.

10.ఇంట్లో ప్రతీగదిలో కూడా వస్తు ప్రకారం వస్తువులను అమర్చుకోవాలి.

ఇలాంటి ఇంట్లో ఉంటె మీకు అదృష్టం కలసి వస్తుంది…