Healthhealth tips in telugu

Winter Health tips: చలికాలం.. రోగాల కాలం.. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్

Health tips: చలికాలం.. రోగాల కాలం.. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్.. కాలం మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

చలికాలం వచ్చిందంటే చాలు.. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ తదితర శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అవి దరి చేరకూడదంటే తప్పకుండా మీరు కొన్ని చిట్కాలను క్రమం తప్పకుండా పాటించాలి. వ్యాయామంతోపాటు కొన్ని ఆహార నియమాలను అలవరుచుకోవాలి. మరి, అవేంటో చూసేద్దామా!

పొడి చర్మం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి: చలికాలంలో జిడ్డు చర్మం కలిగినవారికి పెద్దగా సమస్యలు ఉండవు. పొడి చర్మం గలవారికే ఎక్కువ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉండాలంటే ఉదయం గోరవెచ్చని నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె చుక్కలు వేసి స్నానం చేయండి. చలికాలంలో సాధారణ సబ్బులకు బదులు గిజరిన్ సబ్బులను వాడండి.

మాయిశ్చరైజర్లు తప్పనిసరి: చలికాలంలో ముఖం అందంగా మెరవాలంటే.. విటమిన్-ఇ ఉండే మాయిశ్చరైజర్లు వాడాలి. రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు, చేతులకు వేజలైన్ లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. పాదాలకు సాక్సులు ధరించండి. వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మరింత సురక్షితంగా ఉంటుంది.

నీళ్లు ఎక్కువగా తాగండి: చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుందనే కారణంతో చాలామంది నీటిని తాగడం తగ్గించేస్తారు. అది అంత మంచి అలవాటు కాదు. అలా చేస్తే శరీరంలో నీటి శాతం తగ్గి చర్మం పొడిబారిపోతుంది. జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. చలికాలంలో కూడా వీలైనంత ఎక్కువ నీరు తాగండి.

వ్యాయామం తప్పనిసరి: చలికాలంలో నిద్ర లేచిన తర్వాత ఒళ్లంతా పట్టేసినట్లు ఉంటుంది. కొంతమంది ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేస్తే కండరాలు ఉత్తేజితమవుతాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరిగి వెచ్చగా ఉంటుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."