Beauty Tips

Nails Care Tips: గోర్లు త్వరగా విరిగిపోతున్నాయా.. ఈ చిట్కాలతో వాటిని బలంగా.. అందంగా చేసుకోండి..

Nails Care Tips: గోర్లు త్వరగా విరిగిపోతున్నాయా.. ఈ చిట్కాలతో వాటిని బలంగా.. అందంగా చేసుకోండి.. శరీర సౌందర్యంలో గోళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అది తెలియక చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే మీ గోళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

గోళ్లు మన ఆరోగ్యానికి ప్రతిబింబం అని చెప్పవచ్చు. ఎందుకంటే గోళ్ళను చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత, అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు.

గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపు రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా లేదని అనుమానించాలి. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపంగా ఉన్నట్లుగా గుర్తించాలి.

1. గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే దాన్ని వదిలేయాలి.
2. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్ బి, సి లోపం వల్ల గోళ్లు నెర్రులిచ్చే అవకాశం ఉంటుంది.అందువలన ప్రొటీన్లు, విటమిన్ ఈ, ఎ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఇవన్నీ లభించేలా తగిన పోషకాహారం తీసుకోవాలి.
3. గోళ్లు పెళుసుగా ఉంటే వేడినీటిలో కొంత నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీము లేదా లోషన్ రాయాలి.
4. వారానికి రెండు సార్లు మ్యానిక్యూర్ చేసుకోవడం ఎంతో ఉపయోగకరం.
5. విటమిన్ ఈ క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు సుతిమెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.
6. గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఓ 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.