Toli ekadashi 2024:రేపు తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే సకల పాపాలు జన్మ జన్మ కష్టాలు తొలగిపోతాయి
Toli ekadashi 2024:రేపు తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే సకల పాపాలు జన్మ జన్మ కష్టాలు తొలగిపోతాయి.. సాధారణంగా ఆషాఢ మాసం మంచిది కాదని అంటారు కానీ,చాలామంచిది.విష్ణు ప్రీతికరం ఈ మాసం. ఎన్నో పండుగలతో కూడిన పుణ్యాన్ని చేకూర్చే మాసం. నిజానికి మొట్టమొదటి పండగ ఆషాఢమాసం లో వచ్చే శుక్ల ఏకాదశి . దీన్నే తోలి ఏకాదశి అంటారు. చాలా విశిష్టమైన రోజు.
ఉత్తరాయణం, దక్షిణాయనం రెండూ కల్సి వచ్చే మాసం ఆషాఢ మాసం. దక్షిణాయంలో భగవన్నామ స్మరణ చేస్తే, ఉత్తమగతి ప్రాప్తిస్తుంది. ముక్తిని దరిచేర్చే సాధనం దక్షిణాయనం అని చెప్పవచ్చు. అందుకే ఉత్తరాయణమే కాదు దక్షిణాయనం కూడా పుణ్య కాలమే. ఈ రోజు నది కానీ,చెర్వు గాని, పుష్కరిణి గానీ ఎక్కడో అక్కడ సంకల్ప యుక్తంగా స్నానం ఆచరించి,దగ్గరలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం గాని, విష్ణాలయం గాని,రామాలయం గానీ,శివాలయం గాని దర్శించి, అభిషేకాదులు నిర్వహించాలి.
ఇక పేలాలు పొడి చేసి, నెయ్యి, ఏలకులు, బెల్లం వేసి, సమ్మిళితం చేసి, ఆ ప్రసాదాన్ని పాలతో కల్సి నైవేద్యం పెట్టి, అందరికీ పంచిపెడితే వారికి గల తాపత్రయాదులు నశిస్తాయని కొందరు పండితులు సూచిస్తున్నారు.మన తెలుగు మాసాలలో 24ఏకాదశులు ఉంటాయి. ఇందులో తొలిఏకాదశి ని శయన ఏకాదశి అంటారు.
పీఠాధిపతులు,మఠాధిపతులు,ఏటీశ్వరులు చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. వారు ఎక్కడ ఉంటె అక్కడే చాతుర్మాస్య వ్రతం మొదలుపెట్టి, పూర్తిచేస్తారు. గృహస్థులు కూడా ఆచరించవచ్చు. విష్ణువు ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే రోజు. ఆషాఢం,శ్రావణం,భాద్రపదం,ఆశ్వయుజం మాసాలు ముగిశాక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్ర లేస్తాడు. దీన్నీ చిలుకు ద్వాదశై , ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారు. అందుచేత ఈ నాలుగు మాసాలు విష్ణువుని ఎవరైతే అర్చిస్తారో వారికి హరిపద ప్రాప్తి కలుగుతుంది.
ఎవరైతే విష్ణు సంకీర్తన చేస్తారో వారికి ముక్తి కలుగుతుంది. విష్ణువు కోసం ద్వార పాలకులు కూడా ఎదురు చూసే రోజు. గుమ్మడికాయ, పలు, పెరుగు,వస్త్రం,నెయ్యి, వెన్న,,గోవు విష్ణు ప్రీతిగా దానం ఇస్తే,వారు అనుకున్న పనులు నెరవేర్చబడతాయి. మకర సంక్రమణం నాడు ఏవిధంగా దాన ధర్మాదులు చేస్తామో అలాగే ఇప్పుడు కూడా చేస్తే ఇహపరమైన భోగ భాగ్యాలు లభిస్తాయి