White Hair:తెల్ల జుట్టు వస్తుందని బాధపడకండి..ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది..
White Hair:తెల్ల జుట్టు వస్తుందని బాధపడకండి..ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.. చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటం వలన చాలా కంగారు పడుతూ ఉంటారు.
అలా కంగారు పడకుండా ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. తెల్లజుట్టు సమస్య అనేది ఉన్నప్పుడు చాలామంది రకరకాల హెయిర్ డ్రై లు వాడేస్తూ ఉంటారు.ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉన్న వస్తువులతో ఈజీగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
అంతేకాకుండా జుట్టు రాలే సమస్య లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీనికోసం స్టౌ వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించి వడగట్టాలి. వడగట్టిన ఈ నీటిలో గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ కలపాలి.
హెన్నా పౌడర్ అనేది జుట్టుకు మంచి రంగును ఇవ్వటమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఆ తర్వాత 2 స్పూన్ల సీకాయ పొడి, రెండు స్పూన్ల బృంగరాజ్ పౌడర్ వేసి బాగా కలపాలి ఆ తర్వాత రెండు స్పూన్ల మందారపువ్వుల పొడిని వేసి బాగా కలపాలి ఇవన్నీ బాగా కలిసాక రాత్రంతా అలా వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయం ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి గంట తర్వాత మామూలు నీటితో తలస్నానం చేయాలి. సాయంత్రం సమయంలో నూనె రాసి మసాజ్ చేసి మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు నల్లగా అవటమే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.