Beauty Tips

Neem For Dandruff:చుండ్రు సమస్య వేధిస్తుందా? అయితే ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు

Neem For Dandruff:చుండ్రు సమస్య వేధిస్తుందా? అయితే ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు.. వేపలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. మన ఇంటి చుట్టూ పక్కల ఉన్న ఎన్నో రకాల మొక్కలు మనకు బాగా సహాయపడతాయి.

చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే ఒక పట్టానా వదలదు. చుండ్రు సమస్య రాగానే మనలో చాలా మంది ఖరీదైన నూనెలు,షాంపూలు వాడుతూ ఉంటారు. వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి తగ్గించుకోవచ్చు.

చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. వేప ఆకులు చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వేపాకులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే. వేపాకును గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

కొన్ని వేపాకులను నీటిలో వేసి నీరు ఆకుపచ్చ రంగు అయ్యేవరకు మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారనివ్వాలి. ఈ నీటిని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది.

వేప ఆకులను పేస్ట్ గా చేసి జుట్టుకి బాగా పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. కొద్దిగా కొబ్బరినూనెలో పది వేపాకులను వేసి నూనెను బాగా వేడిచేయాలి. ఈ విధంగా వేడి చేసిన నూనెను చల్లబరచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆముదం కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఈ వేపనూనెను వారానికి రెండు సార్లు రాసి… ఒక గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు. వేపలో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను మరియు చుండ్రుకి కారణం అయినా కారకాలను నిర్మూలించి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.