Beauty Tips

Hair Care Tips:షాంపూలో ఈ రెండు కలిపి వాడితే జుట్టు రాలే సమస్య జీవితంలో అసలు ఉండదు

Hair Care Tips:షాంపూలో ఈ రెండు కలిపి వాడితే జుట్టు రాలే సమస్య జీవితంలో అసలు ఉండదు.. జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.

ఈ మధ్య కాలంలో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు ఫలించక ఎంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు.

కొంతమంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త ఓపికగా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. మనం రెగ్యులర్ గా షాంపూ వాడుతూ ఉంటాం కదా…ఆ షాంపులో ఇప్పుడు చెప్పే రెండు పదార్థాలు కలిపి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక కప్పు కొబ్బరి నూనె పోయాలి. నూనె కాస్త వేడి అవ్వగానే రెండు స్పూన్ల కలోంజి గింజల పొడిని వేసి తక్కువ మంటపై ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను పల్చని వస్త్రం సాయంతో సపరేట్ చేయాలి. ఈ నూనెను ఒక బాటిల్ లో పోసి నిల్వ చేసుకోవచ్చు.
hair fall tips in telugu
ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక బౌల్ లో రెగ్యులర్ గా వాడే షాంపును మూడు స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత తయారుచేసి పెట్టుకున్న కలోంజి నూనెను అర స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా పొడి జుట్టు, జుట్టు డామేజ్ కావటం వంటి అన్ని సమస్యలు తగ్గిపోతాయి. ఇలా ఇంటిలో సహజ సిద్ధంగా చేసుకున్న వాటిని ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK