Beauty Tips

Banana Peel For Face:అరటి తొక్కలో ఇది ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది

Banana Peel For Face:అరటి తొక్కలో ఇది ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది.. ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు ఏమీ లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే వేల కొద్దీ డబ్బులు ఖర్చు చేసి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. .
Banana Peel benefits in telugu
కాస్త ఓపిక, శ్రద్ధ, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే చర్మం మీద మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ కోసం అరటి తొక్కలను ఉపయోగిస్తున్నాం. అరటి తొక్క మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలను ఓపెన్ పోర్స్ లను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది.

బాగా పండిన ఒక అరటిపండు తొక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో 200 ml నీటిని పోసి దానిలో అరటిపండు తొక్క ముక్కలు., ఒక స్పూన్ బియ్యం వేసి ఉడికించాలి. కొంచెం చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. .

దీనిలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 10 నిమిషాలు అయ్యాక గోరువెచ్చ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉండాలి. ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా వారం రోజులపాటు నిల్వ ఉంటుంది.

ఈ ప్యాక్ వేసుకోవడం నల్లని ముఖం మీద మొత్తం నలుపు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. సన్ టాన్ కూడా తొలగిపోతుంది. అలాగే ముడతలు., నల్లని మచ్చలు, సిగ్మెంటేషన్ వంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ ని తప్పకుండ ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK