Arundhathi movie:అరుంధతి సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ?
Arundhathi movie:అరుంధతి సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. 2009 వ సంవత్సరంలో కోడి రామకృష దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన ‘అరుంధతి’ సినిమా అనుష్కకు ఎంత పేరు తెచ్చిందో మనకు తెలిసిన విషయమే. ఒక రకంగా ఆ సినిమా ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో అరుంధతి పాత్రకు మొదట అనుష్కను కాకా మరో హీరోయిన్ ని అడిగారట. ఆ హీరోయిన్ నో చెప్పటంతో ఆ అవకాశం అనుష్కకు వచ్చింది. ఈ సినిమా అనుష్క కెరీర్ నే మార్చేసింది. ఇక విషయంలోకి వస్తే… అరుంధతి అవకాశం మొదట మలయాళీ భామ మమతా మోహన్ దాస్ కి వచ్చింది.
ఆమెకు సినిమా ఎంపికలో సరైన పరిణితి లేకపోవటంతో నో చెప్పింది. ఆలా మమతా మోహన్ దాస్ నో చెప్పటంతో ఆ అవకాశం అనుష్కకు రావటం ఆమె ఓకే చెప్పటం సినిమా హిట్ అవ్వటం అన్ని చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా అనుష్క కెరీర్ నే మలుపు తిప్పింది. అనుష్క ఇక వెనుతిరిగి చూడవలసిన అవసరం లేకుండా కెరీర్ లో ముందుకు దూసుకుపోయింది.
మమతా మోహన్ దాస్ జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ సరసన నటించి గ్లామర్ డాల్ గా వరస పెట్టి అవకాశాలు వచ్చిన సమయంలో కొన్ని మిస్టేక్స్ కారణంగా కొన్ని మంచి మంచి అవకాశాలను వదులుకుంది. అలాగే ఆమెకు కొంత కాలం అనారోగ్యంతో బాధపడింది. రికవరీ అయ్యి వచ్చిన తర్వాత కూడా రేసులో కాస్త వెనకపడింది.