White Hair Turn Black:తెల్లజుట్టు నల్లబడాలంటే ఈ నూనెతో ఇలా చేస్తే సరిపోతుంది
White Hair Turn Black:తెల్లజుట్టు నల్లబడాలంటే ఈ నూనెతో ఇలా చేస్తే సరిపోతుంది .. మారిన జీవనశైలి కారణంగా మరియు వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి, జుట్టుకు సరైన పోషణ చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి.
ముఖ్యంగా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వస్తుంది. చిన్నవయస్సులోనే తెల్లజుట్టు సమస్య రావటంతో మానసికంగా కృంగిపోతున్నారు. దాంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడి ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ఇంటి చిట్కాలను వాడితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ నువ్వుల నూనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె పోసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
నువ్వుల నూనెలో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చటంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టును నల్లగా చేస్తుంది.
కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.