Dosakaya Sambar:ఇలా చేస్తే దోసకాయ సాంబార్ రుచి చాలా బాగుంటుంది
Dosakaya Sambar:ఇలా చేస్తే దోసకాయ సాంబార్ రుచి చాలా బాగుంటుంది..దోసకాయ సాంబార్..ప్రతి తెలుగు ఇంట్లోనూ ఇష్టపడే రెగ్యులర్ చేసుకునే వంటకం సాంబార్. అందులోకి కాస్తా దోసకాయ ఆడ్ చేసి మంగలూరు దోసకాయ సాంబార్ ను చేసారంటే రుచికి తిరుగుండదు. ఎందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
సాంబార్ మసాల కోసం
పచ్చి శెనగపప్పు-1 టేబుల్ స్పూన్
మినపప్పు- 1 టేబుల్ స్పూన్
జీలకర్ర-1 టీస్పూన్
ధనియాలు-1.5 టేబుల్ స్పూన్స్
మిరియాలు-1/2 టీస్పూన్
మెంతులు-1/4 టీస్పూన్
కరివేపాకు-1 రెబ్బ
బాడిగీ మిర్చి – 6
గుంటూర్ మిర్చి -3-5
నూనె-1 టీస్పూన్
కొబ్బరి-1/4 కప్పు
సాంబార్ కోసం
కంది పప్పు- 1/4 కప్పు
చింతపండు-నిమ్మకాయ సైజ్
పసుపు-1/4 టీస్పూన్
ఉప్పు-తగినంత
దొసకాయ-150 గ్రాములు
ఉల్లిపాయ -1
నూనె 1టీస్పూన్
పచ్చిమిర్చి చీలికలు-2
బెల్లం -2 టీ స్పూన్స్
కొత్తిమీర – చిన్న కట్ట
కరివేపాకు -1 రెబ్బ
నీళ్లు -400 మిల్లిలీటర్లు
తాలింపు కోసం
నూనె -2 టీ స్పూన్స్
ఆవాలు-1 టీస్పూన్
ఎండుమిర్చి-3
ఇంగువ-1/4 టీస్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
తయారి విధానం
1. ముందుగా ఒక కుక్కర్లోకి శుభ్రంగా కడిగిన కందిపప్పును తీసుకోని నీళ్లు పోసి మీడియం మంటమీద మెత్తగా ఉడికించుకోని పప్పు గుత్తి సాయం మెదిపుకోని పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకోని అందులోకి మసాలా కోసం పెట్టుకున్న దినుసులకు వేసి దోరగ వేపు కోవాలి.
3.పప్పులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులోకి కొబ్బరి తురుము వేసి మరో నిమిషం పాటు వేపి మిక్సీ జార్ లో వేసుకోని కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై సాంబార్ కు సరిపడే గిన్నెను పెట్టి వేడెక్కాక నూనె వేసి అందులోకి పెద్ద ముక్కలు గా కట్ చేసుకున్న ఉల్లి పాయలు,గింజలు తీసేసిన దోసకాయ ముక్కలు వేసుకోని కొద్దిగా వేయించుకోవాలి.
5.ఇప్పుడు అందులోకి 250 మిల్లి లీటర్ల నీళ్లు పోసి పసుపు,ఉప్పు వేసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి.
6.పది నిమిషాల తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును,సాంబార్ మసాలా పేస్ట్ ను మిగిలిన నీళ్లు ,కరివేపాకు,పచ్చిమిర్చి ముక్కలు వేసి మూతపెట్టుకోని మరో పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ పై మరిగించుకోవాలి.
7.ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయి స్ట్ పై పెట్టి నూనే వేసి అందులోకి ఆవాలు వేసి చిటపటలాడుతుండగా ఎండు మిర్చి ,ఇంగువ,కరివేపాకు వేసి వేగిన తాలింపును సాంబార్ లో కలుపుకోవాలి.
8.బాగా కలుపుకోని ఒక పదిహేను నిమిషాలు మరగించాక..చివరగా బెల్లం,కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే దోసకాయ సాంబార్ రెడీ అయినట్టే.