MoviesTollywood news in telugu

Magadheera movie:మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో..?

Magadheera movie:మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో.. రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రామ్ చరణ్ ని హీరో నుంచి స్టార్ హీరోగా నిలబెట్టింది. 2009 లో విడుదల అయిన ఈ సినిమా వసూళ్ళ సునామిని సృష్టించింది. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో 100 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది.
Ram Charan Magadheera movie
ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటించింది. కాజల్ కి కూడా ఈ సినిమా మంచి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మొదటగా కాజల్ ని కాకుండా మరొక హీరోయిన్ ని అనుకున్నారు దర్శక నిర్మాతలు. రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉన్నాడనే కారణంతో ఆ హీరోయిన్ ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆ హీరోయిన్ అనుష్క.

రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు మూవీలో అనుష్క నటించింది. 2009 జనవరిలో విడుదలైన అరుంధతి చిత్రంలో అనుష్క రాజకుమారిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక మగధీరలో కూడా రాజకుమారి క్యారెక్టర్ కి అనుష్క అయితే పూర్తిగా న్యాయం చేస్తుందని భావించిన రాజమౌళి మొదట హీరోయిన్ గా అనుష్కని సంప్రదించడం జరిగిందట.

అనుష్క రిజెక్ట్ చేయటంతో ఆ అవకాశం కాజల్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కాజల్ మంచి స్థాయికి వెళ్ళింది. మగధీర చిత్రంతో కాజల్ దశ తిరిగి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.