Nannaku prematho Movie:నాన్నకు ప్రేమతో సినిమాను మిస్ చేసుకున్న హీరో.. ఎవరో తెలుసా..?
Nannaku prematho Movie:నాన్నకు ప్రేమతో సినిమాను మిస్ చేసుకున్న హీరో.. ఎవరో తెలుసా.. సినిమాల్లో ఛాన్స్ లు రావడం కూడా లక్కీయే. ఒక్కసారి ఛాన్స్ లు వచ్చినా ఏవో కారణాలతో వదిలేస్తే,ఆతర్వాత అది హిట్ అయితే వచ్చే బాధ అంతా ఇంతా కాదు.
కొందరు ఏరికోరి వేషం వేసినా హిట్ అవ్వదు. ఇలా రెండు వైపులా కారణాలు ఉంటూ ఉంటాయి. కాగా జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తారక్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.
అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో జగపతి బాబు వేసాడు. నిజానికి ముందుగా ఇతడిని అనుకోలేదంట. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించాడు. విలన్ గా జగపతి బాబు నటించాడు.
ఈ సినిమాలో హీరో అభిరామ్ (ఎన్టీఆర్) తండ్రి (సుబ్రహ్మణ్యం) రాజేంద్ర ప్రసాద్ ను కృష్ణమూర్తి (జగపతిబాబు) మోసం చేస్తాడు. తనను మోసం చేసిన కృష్ణమూర్తిపై పగతీర్చుకోవాలని సుబ్రహ్మణ్యం తన కొడుకులను కోరతాడు. దీంతో సుబ్రహ్మణ్యం చిన్న కొడుకు అభిరామ్ (జూనియర్ ఎన్టీఆర్) రంగంలోకి దిగి కృష్ణమూర్తి (జగపతిబాబు)పై పగ సాధించి అతన్ని రోడ్డుపై తీసుకొస్తాడు.
ముందుగా ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర కోసం తమిళ నటుడు అరవింద స్వామిని అనుకున్నారట. కానీ అప్పటికే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయాడట. అందుకే ఆయన ప్లేస్‌లో అప్పటికే తెలుగులో స్టైలిష్ విలన్‌గా దూసుకెళుతున్న జగపతిబాబును ఎంపిక చేయడంతో మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు తనైదన నటనతో అట్రాక్ట్ చేసి నటుడిగా మరో మెట్టు పై కెక్కాడు.