MoviesTollywood news in telugu

Tollywood Heroines:విదేశీయులను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిన తెలుగు హీరోయిన్స్

Tollywood Heroines:విదేశీయులను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిన తెలుగు హీరోయిన్స్.. నిజమైన ప్రేమకు ప్రాంతం,కులం,మతం,దేశం అనే బేధం ఉండదని సినీ ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలు చాటిచెప్పారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్స్ విదేశీ అబ్బాయిలతో జోడీ కట్టారు. తూర్పు పడమర ద్వారా దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు పరిచయం చేసిన హీరోయిన్ మాధవి అసలు పేరు విజయ లక్ష్మి.

తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన సలహా మేరకు ఆయన శిష్యుడు రాల్క్ శర్మని 1996లో పెళ్ళిచేసుకుని, న్యూజెర్సీలో నివాసం ఉంటోంది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు.. బావగారూ బాగున్నారా అంటూ మెగాస్టార్ తో చిందులేసిన హీరోయిన్ రంభ నటనకు గుడ్ బై చెప్పేసి, 2010లో ఇంద్ర కుమార్ అనే కెనడా వాసిని పెళ్ళాడి, అక్కడే సెటిల్ అయింది.

అయితే ఇద్దరి మధ్యా కొన్ని తేడాలు వచ్చినప్పటికీ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. నటిగా దూసుకెళ్లిన హీరోయిన్ లయ 2006లో సినిమాలను వదిలేసి ,శ్రీ గణేష్ అనే అమెరికా డాక్టర్ ని పెళ్ళాడి అక్కడే సెటిల్ అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి కూతురు ఈమధ్య బాలనటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

విక్టరీ వెంకటేష్ నటించిన సుందరకాండ సినిమాలో తన నటనతో అదరగొట్టిన అపర్ణ ఆతర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు. 2002లో శ్రీకాంత్ అనే ఎన్. ఆర్. ఐ ని పెళ్ళాడి,అమెరికాలో సెటిల్ అయింది. కొన్నాళ్ల క్రితం ఇద్దరి మధ్యా సమస్యలు వచ్చినప్పటికీ మళ్ళీ ఒక్కటయ్యారు. గుడుంబా శంకర్, భద్ర వంటి మూవీస్ లో తన నటనతో ఆకట్టుకున్న మీరా జాస్మిన్ 2014లో దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ ని పెళ్లాడింది. అయితే తర్వాత విడాకులిచ్చేసి ఒంటరిగా జీవిస్తోంది.
Tollywood actress meera jasmine
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా తెలుగులో వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబుతో రాజకుమారుడు వంటి మూవీస్ లో నటించి తెలుగు ఆడియన్స్ కి దగ్గరయింది. 2016లో అమెరికాకు చెందిన జివి గుడ్ ఇనఫ్ ని పెళ్లాడింది. రక్త చరిత్ర వన్ అండ్ టు లో పరిటాల సునీత పాత్ర పోషించిన రాధికా ఆప్టే తర్వాత బాలయ్య సరసన లెజెండ్ మూవీలో నటించి అందరినీ అలరించింది. వెబ్ సిరీస్ లో కూడా తన సత్తా చాటింది. 2013లో లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ బెండింట్ ట్రైలర్ ని పెళ్లాడింది. తాజాగా అమెరికాలోని నిక్ జాన్స్ ని ప్రియాంక పెళ్లాడింది.