Hair Fall:ఈ గింజలను ఇలా తీసుకుంటే జుట్టు రాలకుండా పొడవుగా,ఒత్తుగా పెరుగుతుంది
Hair Fall:ఈ గింజలను ఇలా తీసుకుంటే జుట్టు రాలకుండా పొడవుగా,ఒత్తుగా పెరుగుతుంది.. జుట్టుకి ఎటువంటి సమస్యలు లేకుండా ఒత్తుగా,పొడవుగా పెరగాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన, కాంతివంతమైన జుట్టు మన సొంతం అవుతుంది. ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జుట్టుకి సరైన పోషణ ఉంటే ఇటువంటి సమస్యలు ఉండవు.
నువ్వులలో ఉండే విటమిన్ లు,పాలీ సాచూరేటెడ్ ప్యాటీ యాసిడ్స్, ఖనిజాలు జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ప్రతి రోజు ఒక స్పూన్ తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులను తీసుకుంటే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా సాగి జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే హార్మోన్స్ సమతుల్యత సమన్వయం చేస్తుంది.
మెంతులను జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. మెంతుల్లో ఉండే ప్రోటీన్,నియాసిన్,అమైనో ఆమ్లాలు, పొటాషియం వంటి పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి. ప్రతి రోజు ఒక కప్పు పెరుగులో అరస్పూన్ మెంతుల పొడి వేసి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత తినాలి.
ప్రతి రోజు ఒక స్పూన్ గుమ్మడి గింజలను తీసుకుంటే జుట్టుకి సంబందించిన సమస్యలు ఉండవు. గుమ్మడి గింజలలో ఉండే జింక్, సెలీనియం, మెగ్నీషియం,ఐరన్,కాపర్,విటమిన్ A,B,C వంటి విటమిన్ లు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలకుండా కాపాడతాయి. అలాగే చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.