Honey For Face:తేనెలో కలిపి రాస్తే ముఖం మీద ముడతలు మాయం
Honey For Face:తేనెలో కలిపి రాస్తే ముఖం మీద ముడతలు మాయం..వయస్సు పెరిగే కొద్ది ముఖం మీద ముడతలు మరియు ముఖం నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్యలు ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. తక్కువ ఖర్చులో మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి తగ్గించుకోవచ్చు.
మిక్సీ జార్ లో అరటిపండులో సగం, అవకాడో లో సగం వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ తేనె వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అలా పది నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
తేనెలో ఉండే లక్షణాలు ముడతలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తేనెలో ఉండే యాంటీ సెప్టిక్,యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు దెబ్బతిన్న చర్మ కణాలను మరమత్తు చేస్తాయి. ఇక అరటిపండులో ఉండే లక్షణాలు చర్మం సాగకుండా ఉండేలా చేయటమే కాకుండా మృదువుగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
ఈ ప్యాక్ వేసుకోవటం వలన చర్మం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది. అవకాడోలో ఉన్న లక్షణాలు చర్మానికి పోషణ మరియు కొల్లేజన్ ఉత్పత్తిలో సహాయ పడుతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే ముడతలు లేకుండా మృదువుగా కాంతివంతంగా ముఖాన్ని మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.