Tollywood Comedians:టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?
Tollywood Comedians:టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా.. టాలీవుడ్ లో కమెడియన్స్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొంత మంది కమెడియన్స్ సినిమా హిట్ లో కీలకమైన పాత్రను పోషిస్తారు.
సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. హీరోలు, హీరోయిన్లతో సమానంగా కమెడియన్లు కూడా డబ్భును సంపాదిస్తున్నారు. ప్రతి సినిమాలో కమెడియన్ పాత్ర చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో కామెడి లేకపోతే సినిమాను చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరు. దాంతో కమెడియన్ ల డిమాండ్ కూడా పెరిగింది. వీరు రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసుకుందాం.
హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం ఒక్క రోజుకి ఐదు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఈ మధ్య కాలంలో సినిమాలను బాగా సెలక్టివ్ గా చేస్తున్నారు.
అలీ బాలనటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఒకప్పుడు హీరోగా మారి..ఇప్పుడు కమెడియన్ గా ఒక్క రోజుకి 3.5 లక్షల వరకు తీసుకుంటున్నాడు.
సునీల్ హీరో అయ్యాక ఆ స్థానాన్ని భర్తీ చేసిన వెన్నెల కిషోర్ ఒక్క రోజుకి మూడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.
ఒక్కప్పటి స్టార్ కమెడియన్ గా ఉన్న సునీల్ హీరోగా మారాడు. ఇప్పుడు ఏ పాత్ర వచ్చిన చేస్తున్నాడు. సునీల్ ఒక్క రోజుకు నాలుగు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.
స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి ప్రియదర్శి ఒక్క రోజుకి రెండు లక్షల రెమ్యూనరేషన్ను అందుకుంటున్నారు.
ఒకప్పుడు రైటర్ గా ఉన్న పోసాని ఆ తర్వాత నటుడిగా టర్న్ అయ్యారు. పోసాని కృష్ణ మురళి ఒక్క రోజుకు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.