Beauty Tips

Hair Care Tips;ఇలా చేస్తే పొడిగా మారిన, చిట్లిన జుట్టు, చుండ్రు అన్నీ మాయం అవుతాయి

Hair Care Tips;ఇలా చేస్తే పొడిగా మారిన, చిట్లిన జుట్టు, చుండ్రు అన్నీ మాయం అవుతాయి.. జుట్టులో ఎక్కువ చెమట పట్టటం వలన ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే వారంలో రెండు సార్లు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. చిట్లిన జుట్టు,పొడిగా మారిన జుట్టును మృదువుగా మార్చటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటిలో సహజసిద్దంగా దొరికే పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.
usiri benefits in telugu
ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఉసిరి పొడి, ఒక స్పూన్ వేప పొడి, ఒక స్పూన్ ఆముదం వేసి సరిపడా నీటిని కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని అరగంట అలా వదిలేసి ఆ తర్వాత తలస్నానం చేశాక నూనె రాయకుండా ఉన్న జుట్టుకి ఉసిరి పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి. గంట అయ్యాక సాదరణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.
neem leaves benefits in telugu
ఆ రోజు షాంపూ పెట్టకుండా మరుసటి రోజు షాంపూ పెట్టాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. ఉసిరి జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. అలాగే ఆముదం కూడా జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు పొడిగా ఉంటే చుండ్రు సమస్య,తలలో దురద వంటి సమస్యలు వస్తాయి.
amudam
ఉసిరి పొడిని కూడా ఇంటిలో తయారుచేసుకోవచ్చు. ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. ఈ చిట్కా తెల్లజుట్టును నల్లగా కూడా మారుస్తుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.