Curd For Hair:పెరుగులో కలిపి రాస్తే జుట్టు రాలకుండా చాలా వేగంగా పెరుగుతుంది
Curd For Hair:పెరుగులో కలిపి రాస్తే జుట్టు రాలకుండా చాలా వేగంగా పెరుగుతుంది.. ఈ రోజు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి నల్లనువ్వులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మూడు స్పూన్ల నల్ల నువ్వులను శుభ్రంగా కడిగి నీరు పోసి రాత్రి సమయంలో నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం నానిన నువ్వులను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ నువ్వుల నూనె,అరస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా జుట్టు రాలే సమస్యను బట్టి వారంలో ఒకసారి లేదా రెండు సార్లు చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలటం అగుతుంది. నల్ల నువ్వులలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా చేయటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది.
ఈ ప్యాక్ జుట్టుకి వేయటం వలన జుట్టు కుదుళ్లు బలంగా మారటమే కాకుండా జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉంటుంది. తేమగా ఉండుట వలన చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.