Egg For Health:మీ వయస్సు 40 ఏళ్ళు దాటిందా…గుడ్డు తింటే కలిగే లాభాలు ఇవే..?
Egg For Health:మీ వయస్సు 40 ఏళ్ళు దాటిందా…గుడ్డు తింటే కలిగే లాభాలు ఇవే.. మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా ఇప్పటి రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలంటే తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 40 ఏళ్ల వయసు దాటిన వారు కొన్ని ఆహారాలను తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
ముఖ్యంగా Egg తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అంది ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకలు బలహీనంతో పాటు కండరాల నొప్పులు వంటివి కూడా వస్తూ ఉంటాయి. గుడ్డు తినటం వలన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్లు,కాల్షియం అంది అలసట,నీరసం వంటివి కూడా ఉండవని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.
గుడ్డును ఉడికించి తింటేనే మంచిది. ఒక ఉడికించిన గుడ్డులో పోషకాల విషయానికి వచ్చే సరికి 6.3 గ్రాముల ప్రోటీన్, 77 కేలరీలు, 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 0.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5.3 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-A, విటమిన్-B2, విటమిన్-B5, ఫాస్పరస్ మరియు సెలీనియం వంటివి ఉంటాయి.
అయితే రోజుకి ఎన్ని గుడ్లు తినాలి… అనే విషయానికి వచ్చేసరికి రోజుకి ఒక గుడ్డు తింటే సరిపోతుంది. గుడ్డు త్వరగా జీర్ణం కావడమే కాకుండా శక్తినిస్తుంది. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా ప్రతి రోజు ఉడికించిన Egg తింటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.