No Sugar:నెల రోజుల పాటు షుగర్ తినకపోతే బాడీలో జరిగే చేంజెస్ ఇవే..
No Sugar:నెల రోజుల పాటు షుగర్ తినకపోతే బాడీలో జరిగే చేంజెస్ ఇవే.. మనలో చాలా మంది తీపి పదార్థాలు ఉంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే తీపి పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొంతమంది స్వీట్ అసలు తినరు. అయితే ఒక నెలరోజుల పాటు స్వీట్ తినడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో చూద్దాం.
స్వీట్స్ తినడం వలన రక్త ప్రసరణ పరిమాణం పెరిగి రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె సమస్యలను పెంచుతుంది. అందువల్ల తీపి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. షుగర్,BP సమస్యలతో బాధపడేవారు తీపి పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.
స్వీట్స్ ఎక్కువగా తినటం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందువలన స్వీట్స్ తినటం తగ్గిస్తే అధిక బరువు సమస్య తగ్గుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
షుగర్ తీసుకోకుండా ఉండటం వలన యాక్టివ్ గా ఉంటారు. సాధారణంగా స్వీట్స్ తిన్న తర్వాత నీరసం, అలసట, నిద్ర రావడం వంటివి వస్తాయి. స్వీట్స్ తీసుకోవడం వలన రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది.
షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. అలాగే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. రక్తప్రసరణ తగ్గుతుంది. షుగర్ తీసుకోకుండా ఉంటే రక్తప్రసరణ బాగా సాగుతుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా జీర్ణక్రియ సరిగ్గా సాగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.