Polala Amavasya 2024:పోలాల అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారాలు.. చేయకూడని పనులు..
Polala Amavasya 2024:పోలాల అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారాలు.. చేయకూడని పనులు..
పొలాల అమావాస్య రోజు ఉదయం పూట లేచి, పవిత్రమైన నదులలో స్నానం చేయడం శుభప్రదం. ఈ పవిత్ర దినాన పేదలకు మరియు అనాథలకు దానాలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయని అనేక మంది భావిస్తారు. అలాగే, ఈ రోజు కొన్ని పరిహారాలు ఆచరించడం వలన పితృదోషం మరియు కాలసర్ప దోషాల నుండి విముక్తి పొందవచ్చు.
* పోలాల అమావాస్య సమయంలో తలస్నానం చేయాలి.
* పోలాల అమావాస్య సమయంలో పూర్వీకులను స్మరిస్తూ శ్రాద్ధం మరియు పిండప్రదానం చేయాలి.
* ఈ రోజు శని పూజ చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహాలు పొందవచ్చు.
* ఈ రోజు అన్నదానం మరియు వస్త్రదానం చేయడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు.
చేయకూడని పనులు..
* పొలాల అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు.
* అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం చేయకూడదు.
* ఈ రోజు తలకు నూనె రాసుకోవటం, కటింగ్ చేయడం, షేవింగ్ చేయడం, గోళ్ళు కట్ చేయటం వంటివి చేయకూడదు. ఇవి చేస్తే దరిద్రం వస్తుందని అనేక మంది పండితులు అంటారు.
* శాస్త్రాల ప్రకారం, అమావాస్య రోజున కొత్త పనులు లేదా శుభ కార్యాలు చేయకూడదు.
* అమావాస్య రోజు పసిబిడ్డలను సాయంత్రం సమయంలో బయటకు తీసుకెళ్లరాదు.
Follow the ChaiPakodi WhatsApp channel:https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ