Healthhealth tips in telugu

Pregnant Women:గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారం,ఎంత మొత్తంలో తీసుకోవాలి?

Pregnant Women:గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారం,ఎంత మొత్తంలో తీసుకోవాలి.. మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి వరం. ఆ వరం శాపం కాకుండా చూసుకోవలసిన భాద్యత కూడా ఆమెదే. గర్భిణిలు తీసుకొనే మందుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో,ఆహారం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.

చాలా మంది ఇద్దరికి సరిపడా ఆహారంను తీసుకుంటూ ఉంటారు. అయితే అలా తీసుకోవలసిన అవసరం లేదు. గర్భిణిలు ఎలాంటి ఆహారం,ఎంత మొత్తంలో తీసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాము.

గర్భిణిలు ఎక్కువగా ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ అధిక బరువుతో పుడతాడు అనేది ఒక అపోహ మాత్రమే. గర్భిణిలు ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.అలాగే మోతాదుకు మించి ఆహారం తీసుకోకూడదు.

ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా వీలైనన్ని సార్లు అంటే రోజు మొత్తం మీద నాలుగైదు సార్లు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

అందుబాటులో ఎప్పుడూ కొన్ని పళ్ళను ఉంచుకోవటం మంచిది. సిడ్ లెస్ గ్రేప్స్ వంటి వాటిని స్నాక్స్ గా తీసుకోవాలి. కెఫీన్ అధికంగా లభించే ద్రవ పదార్దాలను పూర్తిగా మానేస్తే మంచిది.

బరువు పెరగటం అనేది గర్భిణిలకు సర్వ సాదారణం. అయితే ఒక్కసారిగా బరువు అధికంగా పెరగటం లేదా తగ్గటం అనేది జరిగితే అది అనారోగ్యానికి చిహ్నం.

అస్మా తో బాధపడే గర్భిణిలు వేరు శనగపప్పు కి దూరంగా ఉండాలి. వీరు ఆహారంలో వీటిని తీసుకుంటే పుట్టబోయే బిడ్డ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పచ్చి మాంసం,ఉడికి ఉడకని మాంసాహారం అసలు తినకూడదు. మాంసాహారంలో ఉండే లివర్ లేదా లివర్ తో చేసిన ఆహార పదార్దాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.