Banana:తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు లభించే అరటి పండును తింటున్నారా..
Banana Benefits:అరటి పండు అనేది సంవత్సరం మొత్తం లభించే పండు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే అరటి పండును ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు అరటి పండు తినటం వలన శరీరంలో అనేక మార్పులకు అవకాశం ఉందని వారు అంటున్నారు.
అరటి పండులో ఉన్న అనేక మంచి గుణాలు శరీరంలో ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతి రోజు అరటి పండును తినడం వల్ల మంచి నిద్ర పొందవచ్చని నిపుణులు చెప్పారు. మరి, అరటి పండు మరియు నిద్ర మధ్య నిజమైన సంబంధం ఉందా? దీనిపై నిపుణుల అభిప్రాయం ఏమిటో చూద్దాం.
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, మరియు విటమిన్ B6 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా మరియు ప్రశాంతతతో ఉంచుతాయి. మెగ్నీషియం విశ్రాంతిని పెంచడంలో, విటమిన్ B6 మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడతాయి.
అయితే, నిపుణులు అరటిపండు నిద్రలేమిని తగ్గించటంలో సహాయం చేయదని చెప్పుతున్నారు నిపుణులు. తాజా పరిశోధనలు కూడా అరటిపండు రోజువారీ పొటాషియం మరియు మెగ్నీషియం అవసరాలను కేవలం ఒక భాగం మాత్రమే తీరుస్తుందని, నిద్ర నాణ్యతను మెరుగుపరచదని సూచిస్తున్నాయి.
ఒక అరటి పండు రోజువారీ పొటాషియం అవసరాలలో కేవలం 10% మాత్రమే అందించగలదు. అలాగే, అరటిపండులో మెగ్నీషియం కూడా తక్కువగా, సుమారు 30 mg మాత్రమే ఉంటుంది, అయితే శరీరానికి రోజుకు 400 mg మెగ్నీషియం అవసరం. కావున, ఒక అరటి పండు తినడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందవు.
అరటిపండులో ఉండే మెగ్నీషియం, విటమిన్ B6 శరీరాన్ని ప్రశాంతపరచడంలో కొంత సహాయపడతాయి, కానీ అవి తక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల, అరటిపండు తినడం వలన నిద్రలేమి పూర్తిగా దూరమవుతుందని చెప్పడం సరైనది కాదు.
అరటి పండు వలన ఆరోగ్యానికి లాభాలు ఉన్నా, నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. డయాబెటిస్ సమస్యలు ఉన్న వారు అరటి పండును తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. అరటిపండ్లలో ఉండే సహజ చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవచ్చు. అందువల్ల, డయాబెటిస్ ఉన్న వారు అరటి పండును తినడంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
Follow the ChaiPakodi WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ