Kitchen Hacks:ఇంట్లో సాలీళ్ల సమస్య ఉందా… ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా తరిమేయండి
Spiders:వర్షాకాలం రాగానే కీటకాల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఇంటిని ఎంత శుభ్రపరచినా కీటకాలు ఏదో ఒక విధంగా లోపలికి చేరుతూ ఉంటాయి. వర్షాకాలంలో వీటిని నియంత్రించడం చాలా కష్టం. దోమలు, ఈగలు, బొద్దింకలు ఇంట్లోకి రానివ్వకుండా ఉండటానికి ఎన్నో చిట్కాలు మనకు తెలుసు.
ఇంట్లో సాలిడులు ఉండటం సాధారణమే. గూళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. ఇంటిని ఎంత తరచుగా శుభ్రం చేసినా, వారం రోజులకు అవి మళ్లీ ఏర్పడతాయి. సాలిడులే దీనికి కారణం. చెట్లపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. ఈ సమస్యను తొలగించే ఉత్తమ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటిలో గానీ మొక్కలపై గానీ సాలిడు పురుగులు అధికంగా ఉంటే, పుదీనా ఆకుల నుండి తీసిన రసం లేదా పుదీనా నూనెతో కూడిన ద్రావణం ఒక స్ప్రే బాటిల్లో నింపి స్ప్రే చేయండి. పుదీనా వాసన వల్ల పురుగులు అక్కడ నుంచి పారిపోతాయి.
వెల్లుల్లి నుండి తీవ్రమైన ఘాటు వాసన వెలువడుతుంది, ఇది కీటకాలకు అసహ్యం. వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి రసం తీసి, నీటిలో కలిపి.. ఆ నీటిని గోడలు, చెట్లు, తలుపులు, మరియు కిటికీల చుట్టూ చల్లండి.
లవంగాలను పొడి చేసి, పుదీనా ఆకుల రసంతో కలిపి, కొంచెం నీటిని జోడించి ఇంట్లో మరియు బయట స్ప్రే చేస్తే, సాలిడులు పారిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ