Healthhealth tips in telugu

Dry Fruits Benefits at Winter: చలి కాలంలో తప్పకుండా తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవే.. తింటున్నారా..

Dry Fruits Benefits at Winter: చలి కాలంలో తప్పకుండా తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవే.. తింటున్నారా.. శీతాకాలంలో ఆరోగ్యం మరియు ఆహారం పరంగా చాలా జాగ్రత్తలు అవసరం. చలి కాలంలో మన రోగ నిరోధక శక్తి సాధారణంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మితమైన మరియు పోషకాహారం తీసుకోవడం ముఖ్యం.

చలి వలన చర్మం పొడిబారి గీతలు పడి డల్‌గా మారే సమస్యలు ఏర్పడవచ్చు. అందువల్ల వింటర్ సీజన్‌లో ప్రత్యేక సంరక్షణ అవసరం. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి.

బాదం
బాదంలో ప్రోటీన్ అధికంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. చలి కాలంలో వీటిని మితంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు మరియు చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

ఖర్జూరం
చలి కాలంలో ఖర్జూరాలు సులభంగా దొరకుతాయి. వీటిలో సహజ స్వీట్‌నెస్ ఉంటుంది. వీటిని తిన్న తర్వాత రోగ నిరోధక శక్తి మరియు ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఖర్జూరాలను స్నాక్స్‌గా లేదా స్మూతీస్, డెజర్ట్స్ వంటివాటిలో కలిపి తినవచ్చు.

ఎండు ద్రాక్ష
శీతాకాలంలో ఎండు ద్రాక్షలు తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. వీటిలో ఐరన్, పొటాషియం, యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనివల్ల చలి కాలంలో వీటిని తినడం మంచిది.

డ్రై ఆప్రికాట్స్
ఎండిన ఆప్రికాట్లలో విటమిన్ ఎ, పొటాషియం, మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని స్నాక్స్ గానీ, సలాడ్స్ గానీ తినవచ్చు.

వాల్ నట్స్
వాల్ నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఇనుము, మరియు మాంగనీస్ వంటి పోషకాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి హృదయ ఆరోగ్యానికి మంచిది. అలాగే చలికాలంలో వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తితో పాటు చర్మం కూడా మెరుగుపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ