Kitchenvantalu

Pickles:వర్షాకాలం పచ్చళ్లు బూజు పడుతున్నాయా? – అయితే ఇలా చేయండి!

Pickles:పచ్చళ్ళు అంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. అందుకే చాలా మంది ఎండాకాలం వచ్చినప్పుడు వివిధ రకాల పచ్చళ్ళు తయారు చేసుకుని సంవత్సరం పొడవునా వాటి రుచిని ఆస్వాదిస్తారు. కానీ వర్షాకాలంలో కొన్ని సార్లు పచ్చళ్ళు బూజు పడి పాడైపోతాయి. దీన్ని నివారించాలంటే కొన్ని టిప్స్‌ను పాటించాలి. అవి ఏమిటో తెలుసుకోండి.

పచ్చళ్ళు పెట్టడానికి ప్లాస్టిక్ బ్యాగ్స్, కంటెయినర్స్ వాడటం చాలా మంది అలవాటు. కానీ అది సరైన పద్ధతి కాదు. గ్లాసు కంటెయినర్స్‌లో పచ్చళ్ళు పెట్టి కాస్త ఎండలో ఉంచితే పచ్చళ్ళు తాజాగా ఉంటాయి. తేమ కూడా తగలదు.

పచ్చళ్ళను స్టోర్ చేయడానికి ముందు జార్లను శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలి. పూర్తిగా పొడిగా మారాక మాత్రమే వాటిలో పచ్చళ్ళను నింపాలి. ఇత్తడి, రాగి, ఇనుము, జింక్ జార్లను వాడకూడదు. ఎందుకంటే ఊరగాయల్లోని ఆమ్లం వీటితో రియాక్ట్ అయ్యి రంగు మరియు రుచిని మార్చవచ్చు.

పచ్చళ్ళను నీడలో ఉంచాలి.. అలాగే సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి. వాటిని తరచుగా కలిపి నూనె సరిపడా ఉండేలా నిర్వహించాలి.

పచ్చళ్ళను చాలా కాలం నిల్వ చేయకుండా తాజాగా తినేలా చూసుకోవాలి. కాలం గడిచే కొద్దీ రంగు మరియు రుచి మారిపోతాయి, కాబట్టి వీటిని త్వరగా వాడేయడం ఉత్తమం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ