Kitchenvantalu

Kitchen Tips:చపాతీలు ఇలా చేస్తే ఎంత సేపు అయినా మెత్తగా ఉంటాయి..

Kitchen Tips:చపాతీలు ఇలా చేస్తే ఎంత సేపు అయినా మెత్తగా ఉంటాయి..అన్నం కన్నా చపాతీలను ఎంచుకునేవారు చాలా మంది ఉన్నారు. లంచ్ నుండి డిన్నర్ వరకు చపాతీలను తయారు చేసి తింటారు. చపాతీలు రుచికరంగా, మెత్తగా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలి. అవి ఏమిటో చూడండి.

చపాతీలు మృదువుగా రావాలంటే, పిండిని బాగా కలిపి ఉంచాలి. దీనికోసం, చల్లని నీరు కాకుండా గోరువెచ్చని నీరు వాడి పిండిని కలపడం ఉత్తమం. గోరువెచ్చని నీరు వాడినప్పుడు పిండి మృదువుగా మారుతుంది, దానితో చేసిన చపాతీలు కూడా మెత్తగా ఉంటాయి.

చపాతీలను చేయడానికి ముందు, కలిపిన పిండిని కొంత సమయం అలాగే ఉంచి, తర్వాత మళ్ళీ మెత్తగా కలపాలి. ఈ ప్రక్రియ వల్ల చపాతీలు మృదువుగా తయారవుతాయి.

చపాతీలను చాలా పలుచగా కాకుండా కొంచెం మందంగా చేయాలి. అలా చేస్తే చపాతీలు బాగా పొంగుతాయి. వాటిని మధ్యస్థ మంటపై వేయండి, అప్పుడు చపాతీలు సరిగ్గా పొంగుతాయి.

ఇలా వేసిన చపాతీలను వేడిగానే తినాలి. అవి చాలా సేపు తాజాగా, మృదువుగా ఉండాలంటే, హాట్ బాక్స్‌లో ఉంచండి లేదా అవి చల్లారకుండా చూసుకోండి.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ