Healthhealth tips in telugu

Tiger nuts benefits: బాదాం, కాజూ కన్నా ఎక్కువ పోషకాలు ఉన్న ఈ నట్స్ గురించి తెలుసా..

Tiger nuts benefits: బాదాం, కాజూ కన్నా ఎక్కువ పోషకాలు ఉన్న ఈ నట్స్ గురించి తెలుసా.. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మనలో చాలా మంది మంచి పోషకాలు ఉన్న ఆహారం పట్ల శ్రద్ద పెడుతున్నారు.

అలా డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకున్నారు. బాదాం, కాజూ కన్నా ఎక్కువ పోషకాలు ఉన్న Tiger nuts గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగు తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు,కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్‌, ఫైబర్ కూడా ఉంటుంది. వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి. వీటితో పాటు విటమిన్ సి, డి, ఇ కూడా ఉంటాయి.

ఈ గింజల్లో కరగని డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దాంతో గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు అసలు ఉండవు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణకు కూడా సహాయపడతాయి. దీనిలో ఉండే అర్జినిన్ అమైనో ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడానికి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

వీటిలో ఉండే ప్రోటీన్ 18 రకాల అమైనో యాసిడ్లను కలిగి ఉండుట వలన ఎముకలతో పాటు కండరాలు, కణజాలాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మోనోశాచురేటెడ్ కొవ్వు ఉండుట వలన గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇ విటమిన్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల కణాల ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. కాబట్టి ఈ nuts ని తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ