Pesarapappu Pakoda : పెసరపప్పుతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. ఎవరైనా సరే మొత్తం లాగించేస్తారు..!
Pesarapappu Pakoda : పెసరపప్పుతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. ఎవరైనా సరే మొత్తం లాగించేస్తారు..ఈ చల్లని వర్షంలో వేడి వేడిగా తినాలని మనలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. బజ్జీలు, వడలు, పకోడీలు, చల్ల పునుగులు, వెజ్ స్నాక్స్, నాన్ వెజ్ స్నాక్స్ ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు చేసుకొని తిని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త బిన్నంగా పెసర పప్పుతో పకోడీలు చేసుకుంటే చాలా బాగుంటాయి.
కావలసిన పదార్ధాలు
పెసర పప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం, ఉప్పు, ధనియాలు, మిరియాలు, ఇంగువ, ఆయిల్.
పెసర పప్పు పకోడీలు తయారీ విధానం:
పెసరపప్పును ఒకసారి శుభ్రంగా కడిగి నీటిని పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. నానిన పెసరపప్పును శుభ్రంగా కడిగి మిక్సిలో వేయాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు, ధనియాలు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ పిండిని గిన్నెలోకి తీసుకోని.. దానిలో కట్ చేసిన ఉల్లి ముక్కలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.ఆయిల్ వేడి అయ్యాక పెసరపప్పు పిండితో పకోడీలు వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పకోడీలు సిద్ధం.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ