Kitchenvantalu

Restaurant Onions: రెస్టారెంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఘాటు లేకుండా.. సీక్రెట్స్ ఏమిటో తెలుసా..?

Restaurant Onions: రెస్టారెంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఘాటు లేకుండా.. సీక్రెట్స్ ఏమిటో తెలుసా.. పచ్చి ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనలో చాలా మంది తింటూ ఉంటారు. అయితే రెస్టారెంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఘాటు లేకుండా ఉంటాయి. వాటి సీక్రెట్ ఏమిటో తెలుసుకుందాం.

పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది. వాటి కారణంగా ఉల్లిపాయలకు ఘాటు వస్తుంది. అయితే వంటల్లో వేసినప్పుడు ఘాటు తగ్గుతుంది. అయితే పచ్చి ఉల్లిపాయలు క్రంచీగా ఘాటు లేకుండా రుచిగా ఉండాలంటే.. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా, గుండ్రంగా కట్ చేసి ఐస్ వాటర్ లో వేసి పది నిమిషాలు ఉంచాలి. దీంతో ఘాటు తగ్గి రుచి పెరగటమే కాకుండా ముక్కలు క్రంచీగా అవుతాయి.

ఉల్లిపాయల ఘాటు తగ్గాలంటే మరో మంచి చిట్కా ఉంది. ఉల్లిపాయ ముక్కల మీద ఉప్పు చల్లి బాగా కలపాలి. పావుగంటయ్యాక ఉప్పు కాస్త చేత్తో తుడిచేసి తింటే ఘాటు లేకుండా రుచీ పెరుగుతుంది.

ఉల్లిపాయ ముక్కలను తినటానికి పది నిమిషాల ముందు కొంచెం నిమ్మరసం చల్లి పక్కన పెట్టాలి. నిమ్మలో ఉండే సిట్రస్ రసాలు ఉల్లిపాయ లోని ఘాటును తగ్గించి రుచి పెంచుతాయి. కాబట్టి ఉల్లిపాయ ఘాటు తగ్గి రుచి పెరగాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ