Pumpkin for Skincare: గుమ్మడి ప్యాక్‌తో చెక్కుచెదరని అందంతో మెరిసిపోండి..!
Pumpkin for Skincare: గుమ్మడి ప్యాక్‌తో చెక్కుచెదరని అందంతో మెరిసిపోండి.. గుమ్మడికాయ మన డైట్‌లో చేర్చుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మనందరికీ తెలుసు. గుమ్మడిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె తో పాటు ఫైబర్ పొటాషియం, పాస్ఫరస్,ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ పోషకాలు అనారోగ్యాలు మన దరిచేరకుండా రక్షిస్తాయి. గుమ్మడి కేవలం ఆరోగ్యానికే కాదు, అందాన్ని సంరక్షించడానికి ఎంతో సహాయప డుతుందని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయలో అధికంగా ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, ఎంజైములు చర్మాన్ని మృదువుగా, కోమలంగా మారుస్తాయి. గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఎ, సీ రెండూ.. ప్రీ-రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
ముందుగా కొన్ని గుమ్మడి కాయ ముక్కలలో నీటిని పోసి మిక్సిలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఒక స్పూన్ పేస్ట్ లో అరస్పూన్ తేనే, అరస్పూన్ కాఫీ పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే పొడి చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.
అంతేకాక ముఖం మీద ఉన్న మొటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఈ ప్యాక్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని దృఢంగా కాంతివంతంగా మరియు మృదువుగా చేస్తుంది. నిర్జీవంగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ