Green Tomato Health Benefits:ఎర్రని వాటి కంటే ఆకుపచ్చని టమోటాలతోనే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం!
Green Tomato Health Benefits:ఎర్రని వాటి కంటే ఆకుపచ్చని టమోటాలతోనే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.. మనకు టమోటాలు అనగానే ఎర్రగా నిగనిగలాడే టమోటాలు మాత్రమే ఉపయోగిస్తాం. దాదాపు అందరూ ఎర్రటి టమోటాలనే కూర వండుకుని తింటారు. మరి ఆకుపచ్చ టమోటాల గురించి తెలుసా?
ఆకుపచ్చని టమోటాలు అంటే ఇది మరొక రకం టమోటా మాత్రం ఏం కాదు, కాయగా ఉన్న దశలో టామోటా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అందుకే వీటిని ఆకుపచ్చ టమోటాలు అంటారు. ఇవి ఎర్రగా పండిన టమోటాల మాదిరిగా మృదువుగా, మెత్తగా ఉండకుండా గట్టిగా ఉంటాయి. అలాగే రుచిలో కాస్త వగరుగా ఉంటాయి.
మనలో చాలా మంది ఎర్రని టమోటాలను ఉపయోగిస్తూ ఉంటారు. పచ్చి టమోటాలను చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తారు. ఎర్ర టమోటాలో ఉండే పోషకాలు అన్ని ఇంచుమించు పచ్చి టమోటాలో కూడా ఉంటాయి. పచ్చి టమోటాతో కూర,పచ్చడి వంటివి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
ఎర్ర టమోటాలో కన్నా పచ్చి టమోటాలో ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్ ఏ గా మారుతుంది. ఇది కంటి సమస్యలు లేకుండా చేయటమే కాకుండా కంటి చూపు మెరుగుదల ఉండేలా చేస్తుంది. అంధత్వానికి ప్రధాన కారణం.అయినా మాక్యులర్ క్షీణతను నివారించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.పచ్చి టమోటాలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గుండెకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. జలుబు, ఫ్లూ మరియు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. దంతాలు, చిగుళ్ళు, ఎముకలు మరియు చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి కూడా చాలా ముఖ్యమైనది. వండిన ఆకుపచ్చ టమోటాలను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ సి పెరుగుతుంది.
పచ్చి టమోటాలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియలో బాగా సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ రోగులకు కూడా బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఆకుపచ్చని టమోటాలో కాల్షియం, పొటాషియం ,ప్రోటీన్, మెగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్ కె కూడా సమృద్ధిగా ఉంటాయి.
పచ్చి టమోటాలో ఉండే విటమిన్ ఎ మరియు సి శరీరంలో వ్యాధి కారకాలతో పోరాటం చేస్తాయి. శరీరంలో చెడు బ్యాక్టీరియా ప్రవేశించకుండా నిరోధించడానికి శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో విటమిన్ బి 6 కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ప్రోటీన్ రక్తంలో కొలెస్ట్రాల్‌ను బంధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) ను తగ్గించడంలో విటమిన్ బి 3 కీలకమైన పాత్రను పోషిస్తుంది.
ఆకుపచ్చ టమోటాలు బయో ఫ్లావనాయిడ్లను కలిగి ఉంటాయి, ఇవి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. నొప్పులను మరియు మంటను తగ్గించటంలో సహాయపడుతుంది. విటమిన్ సి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే వృద్దాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తాయి. ముడతలు కనిపించకుండా ఉండటానికి చర్మ కణాలను పునరుత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది.
ఆకుపచ్చ టమోటాలలో ఉండే పొటాషియం, విటమిన్ ఎ మరియు విటమిన్ సి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి. పచ్చి టమోటాలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్ మరియు చక్కెరలు ఉండుట వలన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. పచ్చి టమోటాలలో టొమాటిడైన్ అనే పోషకం ఉంటుంది.
ఇది కండరాల సౌష్టవానికి, వ్యాయామం చేసే శక్తికి, అలాగే కొలెస్ర్టాల్ కరగడానికి, బలమైన ఎముకలు, కండరాలు ఏర్పడానికి సహాయపడుతుంది.
అలాగే కండరాల డెవలప్‌మెంట్ వేగంగా జరుగుతుంది. అలాగే ఇది బరువు పెరగకుండా అదుపు చేయడంలో చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఒబేసిటీకి గ్రీన్ టమోటా చక్కటి ట్రీట్మెంట్. కండరాలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి టొమాటిడైన్ చాలా అవసరం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ