Foods Replace Eggs:గుడ్లు తింటే అలెర్జీ వస్తోందా.. బదులుగా ఈ 4 పదార్థాలు తింటే పోషకాలు ఫుల్..
Foods Replace Eggs:గుడ్లు తింటే అలెర్జీ వస్తోందా.. బదులుగా ఈ 4 పదార్థాలు తింటే పోషకాలు ఫుల్.. గుడ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, కొంతమందికి గుడ్లు అంటే అలెర్జీ. అదే సమయంలో, కొంతమంది గుడ్లు తినడానికి ఇష్టపడరు. వేగన్ డైట్ పాటించే వారు కూడా గుడ్లు తినడానికి ఇష్టపడరు.
ఇటువంటి పరిస్థితిలో గుడ్లు వంటి పోషకాలను ఎలా పొందాలనే ప్రశ్న తలెత్తుతుంది. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్లు తినని వారు ఈ శాఖాహారంతో ఎగ్స్ కొరతను తీర్చుకోవచ్చు. ఈ 3 పదార్థాలను తీసుకుంటే గుడ్డులో ఉన్న అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
అరటిపండు
సంవత్సరం పొడవునా దొరికే అరటిపండు గుడ్డుకు గొప్ప ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. చాలా చవకగా లభించే అరటి పండులో దాదాపుగా అన్ని సూక్ష్మ, స్థూల పోషకాలు ఉంటాయి. అరటిపండులో కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, సి, బి6, బి12 ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు ఉండుట వలన మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.
చియా సీడ్స్
గుడ్డుకు చియా సీడ్స్ బెస్ట్ రీప్లేస్‌మెంట్ అని చెప్పవచ్చు. దీనిలో ఉన్న పోషకాలను బట్టి ఒక సూపర్ ఫుడ్ గా చెప్పుతారు. వీటిలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు,ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఒమెగా 3 సమృద్దిగా ఉంటాయి. కాబట్టి చియా సీడ్స్ తీసుకుంటే మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది.
కందిపప్పు
మనం ప్రతి రోజు కందిపప్పును వాడుతూనే ఉంటాం. కందిపప్పులో ఉండే ప్రొటీన్లూ, కొవ్వులూ, కార్బో హైడ్రేట్‌లూ శరీరానికి అంది తక్షణ శక్తినీ అందిస్తాయి. ఫోలేట్ సమృద్దిగా ఉండుట వలన మహిళలకు మేలు చేస్తుంది.
బాదం పప్పు
బాదంను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. బాదంలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఈ, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడు, కళ్లు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతి రోజు 5 బాదం పప్పులను నానబెట్టి తింటే.. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బాదం పప్పును నానబెట్టి తింటే 100 శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ