Healthhealth tips in telugu

Spinach-Health Care: పాలకూర తింటే కలిగే అద్భత ప్రయోజనాలు ఇవే..!

Spinach-Health Care: పాలకూర తింటే కలిగే అద్భత ప్రయోజనాలు ఇవే.. పాల కూర తినమని ఎందుకు చెబుతారు? తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఈ ఆకు కూరలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మంచు, చలి విపరీతంగా ఉంది. ఇటువంటి సమయంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ ఇలా వరుసగా వచ్చేస్తాయి. వీటిని అశ్రద్ధ చేస్తే జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు., గొంతు నొప్పి వంటి వాటిని తగ్గించుకోవటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం.

దగ్గును తగ్గించుకోవటానికి పాలకూర చాలా బాగా సహాయపడుతుంది. పాలకూరలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇక పాలకూర ఏ విధంగా తీసుకుంటే దగ్గు., జలుబు, గొంతు నొప్పి తగ్గుతాయో చూద్దాం. ఈ కాలంలో ఆకుకూరలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. అలాగే చాలా చవకగా దొరుకుతాయి.

పాలకూరని తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత కట్ చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి కొంచెం .వేడి అయ్యాక కట్ చేసిన పాలకూరను వెయ్యాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించి ఆ నీటిని వడకట్టాలి. ఈ నీటిలో రెండు స్పూన్ల అల్లం రసం కలపాలి.. అల్లంలో ఉండే పోషకాలు గొంతు సమస్యలను తగ్గిస్తాయి.

ఈ డ్రింక్ ని ప్రతిరోజు ఉదయం మూడు రోజులపాటు తీసుకుంటే అందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను చురుకుగా మార్చి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాస సంబంద సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది. శ్వాస బాగా ఆడేలా చేస్తుంది. ఆస్తమా నుంచి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ