NTR-Krishna: ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ తీసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే..?
Krishna And NTR :సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. వీరిద్దరు ఇండస్ట్రీలో చాలా సినిమాలతో పోటీపడ్డారు. ఈ ఇద్దరు హీరోల్లో ముందుగా రాజకీయాల్లోకి వచ్చింది ఎన్టీఆర్. సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీపడినప్పటికీ రాజకీయ రంగంలోకి మాత్రం కృష్ణ మొదట్లో రాలేదు.
నిజానికి కృష్ణ తీసిన 200వ చిత్రం ఈనాడు సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం విజయానికి పరోక్షంగా దోహదం చేసింది. ఎన్టీఆర్ గెలిచాక ఈనాడు 100రోజుల సందర్బంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెల్పుతూ కృష్ణ ప్రకటన కూడా ఇచ్చాడు. అయితే 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం, ప్రధాని కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలో తేవడానికి కసరత్తు కూడా జోరందుకుంది.
ఆ సమయంలో కృష్ణను రాజకీయాల్లోకి రావాలని రాజీవ్ గాంధీ స్వయంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణను ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సినిమాలు తీయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దాంతో కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన తొలిమూవీ సింహాసనం లో రాజగురువు సత్యనారాయణ చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో మాట్లాడిన ‘నా దగ్గరేముంది బూడిద’ అనే డైలాగ్.
ఆతర్వాత నా పిలుపే ప్రభంజనం మూవీలో ఎన్టీఆర్ పోలిన పాత్రను సత్యనారాయణ పోషించారు. సినిమా లో కొన్ని డైలాగులు దాసరి నారాయణరావుతో రాయించారు. సినిమా హాల్స్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఆందోళన చేస్తే సినిమాకు ఇంకా పబ్లిసిటీ వస్తుందని ఊహించారు. కానీ ఎవరినీ ఆందోళన చేయొద్దని ఎన్టీఆర్ ఆదేశించారు.
ఇక దాని తర్వాత ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో మండలాధీశుడు మూవీ ని కృష్ణ తీశారు. ఎన్టీఆర్ పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు వేయగా, సీనియర్ నటి భానుమతి ఇందులో నటించడం కూడా పెద్ద సంచలనంగా మారింది. ఈ మూవీ మొదట్లో కృష్ణ కనిపిస్తారు. అయితే కోటకు రెండేళ్లపాటు ఎవరూ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వలేదు. ఇక సాహసమే నా ఊపిరి పేరిట మరో మూవీ కృష్ణ తీశారు.
ఎన్నికల ముందు వచ్చిన ఈ మూవీని రాజీవ్ గాంధీకి చూపించారు. ఇక ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో గండిపేట రహస్యం పేరిట మరో సెటైర్ మూవీ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ విశ్వామిత్ర సినిమా తీస్తున్న సమయంలో కలియుగ విశ్వామిత్ర మూవీని విజయ చందర్ డైరెక్షన్ లో కృష్ణ బావమరిది యు సూర్యనారాయణ బాబు నిర్మించారు.
Click Here To Follow Chaipakodi On Google News