Kitchenvantalu

Garlic Smell:వెల్లుల్లి..ఉల్లిపాయల ఘాటైన వాసలు పోగట్టడం ఎలా…?

Onion and garlic Smell remove Tips:వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఉల్లిపాయలను కోసినప్పుడు వెల్లుల్లిపాయలను వలిచినప్పుడు చేతులు వాసన వస్తూ ఉంటాయి.

ఎందుకంటే ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి ఘాటైన వాసన ఉంటుంది. మనం చేతులను ఎంత శుభ్రం చేసుకున్న ఆ వాసన వదలదు. ఉల్లి,వెల్లుల్లి వాసన తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి బాగా కలిపి ఆ నీటిలో చేతులను కాసేపు ఉంచితే ఉల్లి,వెల్లుల్లి వాసన తొలగిపోతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ ఉప్పు వేసి నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని చేతులకు రాసి రెండు నిమిషాల పాటు రుద్దుకొని చేతులు కడిగితే వాసన తొలగిపోతుంది.

అరచేతులపై కాఫీ పౌడర్ జల్లుకుని తడిచేసి చేతులను రబ్ చేస్తే వాసన తొలగిపోతుంది. ఇప్పుడు చెప్పిన చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి ఉల్లి,వెల్లుల్లి వాసనను తొలగించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."