Pawan Kalyan:పవర్ స్టార్ పెళ్ళికి ముందు లవ్ స్టొరీ మీకు తెలుసా..ఆ అమ్మాయి ఎవరో…?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా సినీ పరిశ్రమకు వచ్చిన చాలా చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు. ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నాడు. పవన్ గురించి ఏ వార్త వచ్చిన తెలుసుకోవటానికి అభిమానులు సిద్దంగా ఉంటారు.
ఈ మధ్య వచ్చిన BRO సినిమా సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా పవన్ అభిమానులను ఈ సినిమా బాగా అలరించింది. అయితే ఇక పవన్ ఎంతో బిడియస్తుడు,ఎవ్వరితో మాట్లాడడు అని అందరికి తెలుసు అందరూ చెప్తూనే ఉంటారు.అయితే అలాంటి పవన్ కు పెళ్ళి కి ముందు ఒక ప్రేమ కథ ఉందని మీకు తెలుసా..
ఇంతకి అది ఎక్కడ మొదలయ్యిందో మీకు తెలుసా..అవును పవన్ కు ఒక లవ్ స్టొరీ ఉంది.పవన్ చెన్నైలో అన్నయ్య చిరంజీవి గారి ఇంట్లో ఉంటున్న సమయం లో ఇంకా సినిమాలలోకి రాకముందు ఆయన కంప్యూటర్ క్లాస్ లకు వెళ్ళేవారు.అయితే ఆ సమయం లో ఆ క్లాస్ లకు ఒక అందమైన అమ్మాయి కూడా వచ్చేది.
అయితే ఆ బ్యాచ్ లో ఉన్న చాలా మంది అబ్బాయిలు ఆ అమ్మాయితో మాట్లాడాలని ఎంతో ట్రై చేశారు కాని ఆ అమ్మాయి ఎవ్వరితో మాట్లాడని పవన్ తో మాట్లాడడం చూసి వారు అందరూ పవన్ తో అది ప్రేమే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయమంటే అందరిని తిట్టాడు.
కాని తర్వాత కొన్ని రోజులకు నిజమే ప్రేమే అని ఆమెను కారులో బయటకు తీసుకెళ్ళి ప్రపోజ్ చేయగా ఆ అమ్మాయి నీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత నాకు ఇష్టం లేదు అని పవన్ ప్రేమని తిరస్కరించి అక్కడినుంచి కోపం గా వెళ్ళి పోయింది.
ఇక తర్వాత పవన్ చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.అయితే ఈవిషయం గురించి పవన్ గోకులం లో సీత సినిమా సమయం లో ఒక పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.అది సంగతి.
Click Here To Follow Chaipakodi On Google News