Kitchenvantalu

KItchen Tips:వంటల్లో ఈ టిప్స్ పాటించండి..వంట సులభంగా అవుతుంది

Useful Cooking Tips:మనం వంటగదిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట రుచిగా రావటమే కాకుండా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

వంటల్లో ఈ టిప్స్ పాటించండి..వంట సులభంగా అవ్వటమే కాకుండా రుచి అద్భుతంగా ఉంటుంది. వంటలు టేస్టీగా రావాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. అలాగే వంట చేసే సమయంలో కొన్ని తప్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

కూర వండేటప్పుడు కొన్నిసార్లు నీళ్లు ఎక్కువగా పోస్తూ ఉంటాం. ఆ నీరంతా మరిగి గ్రేవీ చిక్కబడటానికి చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో ఒక స్పూన్ గసగసాలు వేగించి మెత్తని పేస్ట్ గా చేసి కూరలో కలిపితే సరిపోతుంది. కూర చాలా రుచిగా కూడా ఉంటుంది.

ఇడ్లీలు పులిసిన వాసన రాకుండా మంచి రుచిగా ఉండాలంటే పిండి రుబ్బే సమయంలో మూడు స్పూన్లు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి రుబ్బాలి. అప్పుడు ఇడ్లీ మృదువుగా ఉండటమే కాకుండా మంచి రుచిగా ఉంటాయి.

పాలక్ పన్నీర్, ఆలూ పన్నీర్ వంటి కూరలు వండినప్పుడు చాలామందికి మంచి రంగు రాదు. పాలకూర ఆకుపచ్చ రంగు పోకుండా ఉండాలంటే పాలకూరను నీళ్లలో ఉడికించిన తర్వాత వెంటనే చల్లని నీటిలోకి మార్చాలి.

ప్రెజర్ కుక్కర్ లో అన్నం అతుక్కోకుండా పొడిపొడిగా రావాలంటే కొన్ని చుక్కల నూనెను వేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/