Kitchenvantalu

Andhra Style Gummadikaya Pulusu:సాంప్రదాయ గుమ్మడికాయ పులుసు రుచిగా రావాలంటే ఇలా చూడండి.. రైస్ లో చాలా బావుంటుంది

Andhra Style Gummadikaya Pulusu:సాంప్రదాయ గుమ్మడికాయ పులుసు రుచిగా రావాలంటే ఇలా చూడండి రైస్ లో చాలా బావుంటుంది..ఆంధ్రులకు అత్యంత ఇష్టమైన వంటకం ముద్దపప్పు,దానికి తోడు గుమ్మడికాయ పులుసు గాని యాడ్ చేసుకున్నారంటే..ఇక తిరుగేముంటుంది చెప్పండి.

కావాల్సిన పదార్ధాలు
గుమ్మడికాయ పులుసు కోసం..
తియ్యటి గుమ్మడి ముక్కలు – 300 గ్రాములు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
మెంతులు – ¼ టీ స్పూన్
ఎండుమిర్చి – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
ఇంగువ -2 చిటికెలు
కరివేపాకు – 2 రెమ్మలు
ఉల్లిపాయ చీలికలు – 1 ¼ కప్పులు
పచ్చిమిర్చి – 2
ఉప్పు – రుచికి సరిపడా
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
కారం – ½ టేబుల్ స్పూన్
పసుపు – 1/8 టీ స్పూన్
నీళ్లు – 800 ml
చింతపండు పులుసు – 250 ml
బెల్లం – 60 గ్రాములు కొత్తిమీర – చిన్న కట్ట

ముద్దపప్పు..
కంది పప్పు – ½ కప్పు
నూనె – 1 టీ స్పూన్
నీళ్లు – 1 ¼ కప్పు
పసుపు – ¼ టీ స్పూన్
నెయ్యి – 3 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు

తయారీ విధానం
1.గుమ్మడికాయ పులుసు కోసం నూనే వేడి చేసి ఆవాలు మెంతులు, మినపప్పు,ఎండుమిర్చి ,జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసి ఎర్రగ వేపుపోవాలి.
2.వేగిన తాలింపులో ,ఉల్లిపాయచీలికలు,పచ్చిమిర్చి ఆవాలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేపుకోవాలి.
3.మెత్తపడి ఉల్లిపాయలో గుమ్మడి ముక్కలు ,ధనియాల పొడి,పసుపు,కారం,కొంచెం నీళ్లు వేసి వేపుకోవాలి.
4.నీళ్లు పోసి గుమ్మడి ముక్కలు మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించాలి.
5.గుమ్మడి మెత్తబడిన తరువాత చింతపండు పులుసు ,బెల్లం వేసి ఇంకో పదిహేను నిమిషాలు మరిగించాలి.

6.తర్వాత కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7.ముద్ద పప్పు కోసం నూనె వేడి చేసి కందిపప్పు వేసి సన్నని సెగ పైన వేపుకోవాలి.
8.వేగిన పప్పులోకి నీళ్లు పోసి పసుపు వేసి మీడియం ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.
9.మెత్తగా ఉడికించిన పప్పులో ఉప్పు వేసి పప్పు గుత్తి సాయంతో ఎనుపుకోవాలి.
10.తాలింపు కోసం ఉంచిన నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర ,ఇంగువ వేసి జీలకర్ర వేసి ఎనుపుకున్న పప్పులో కలుపుకోవాలి.
11.వేడి వేడి అన్నంలో,ముద్దపప్పు విత్ గుమ్మడి కాయ పులుసుతో సర్వ్ చేసుకోవడమే..
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u