Healthhealth tips in telugu

Thyroid:ఈ గింజలను ఇలా తీసుకుంటే 15 రోజుల్లో ధైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు

Thyroid problems Home remedies in telugu:థైరాయిడ్ సమస్య అనేది ఒకప్పుడు ఆడవారిలో ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం మగవారిలో కూడా కనబడుతుంది. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి స్రవించే హార్మోన్లు మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
dhaniyalu
థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే దాంతోపాటు అధిక బరువు, చికాకు, ఒత్తిడి, జుట్టు రాలిపోవడం, కండరాల నొప్పులు, నీరసం వంటివి వస్తాయి. అందువల్ల థైరాయిడ్ సమస్యలను అస్సలు అశ్రద్ధ చేయకూడదు.

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తగిన మందులు వాడుతూ ఇంటి చిట్కాలు ఫాలో అయితే థైరాయిడ్ గ్రంథి పని తీరు మెరుగవుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ధనియాలు చాలా బాగా సహాయపడుతుంది. ధనియాలలో ఉన్న ఔషధ గుణాలు థైరాయిడ్ సమస్యకు చెక్ పెడతాయి. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను ధనియాలని వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం నీటిని తాగాలి.

ఈ విధంగా చేయడం వలన ధనియాలులో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరిచే హార్మోన్ల అసమతుల్యతను తొలగిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u