MoviesTollywood news in telugu

Sneha Ullal: జూనియర్ ఐశ్వర్యరాయ్ స్నేహ ఉల్లాల్ గుర్తుందా?…ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Sneha Ullal: జూనియర్ ఐశ్వర్యరాయ్ స్నేహ ఉల్లాల్ గుర్తుందా?…ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..కొందరు హీరోయిన్స్ కొందరు టాప్ హీరోయిన్స్ ని పోలి వుంటారు. ఆవిధంగా ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ లా ఉండడం వలన , స్నేహా ఉల్లాల్ సినీ రంగ ప్రవేశం చాలా ఈజీగానే సాగింది.

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఐశ్వర్యలా ఉండడం వలన బాలీవుడ్ లో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇక అనారోగ్యం ఇతరతరా కారణాల వలన ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమకు దూరం అయింది. మొత్తానికి ఇప్పుడు మళ్ళీ సినిమాలమీద దృష్టిపెట్టిందని అంటున్నారు. దక్షిణాదిన అడపాదడపా కనిపించిన ఈమె ఇప్పుడు కెరీర్ ని దూసుకెళ్లేలా చూసుకుంటోదట.

మహిళలకు ఇండస్ట్రీలో గౌరవం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి మంచి గౌరవం లభిస్తోంది. ఇది శుభ పరిణామం. వాతావరణం సానుకూలంగా ఉంది. అందుకే కెరీర్ ని మళ్ళీ మొదలు పెట్టాలని అనుకుంటున్నా’అని ఈమధ్య ఓ ఇంటర్యూలో ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ 2005లో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసారని,అప్పటిలో హీరోయిన్స్ కి పరిస్థితులు భిన్నంగా అంటే చాలా దారుణంగా ఉండేవని స్నేహ ఉల్లాల్ చెప్పింది. మీటు బాధితురాలిగా మిగిలిపోయేదాన్నని పేర్కొంది.

ప్రొడ్యూసర్స్,డైరెక్టర్స్,సినిమా బృందంలో కూడా అనేకమందితో రకరకాలుగా వేదన అనుభవించానని గుర్తుచేసుకుంది. అయితే ఇప్పుడు సినిమా నిర్మాణంలో , చిత్రీకరణలో అనేక మార్పులవలన మహిళలకు సముచిత గౌరవం దక్కుతుందని స్నేహ ఉల్లాల్ చెప్పింది.

గతంలో ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేసిన ఈ భామ ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. హిందీ డిజిటల్ వేదికగా ఛాన్స్ లు కొట్టేసున్న ఈ అమ్మడు మాట్లాడుతూ ‘ఇండియాకు తిరిగి వచ్చాక నెట్ ఫ్లిక్స్ కి ఫ్యాన్ గా మారిపోయాను. అందుకే నెట్ ఫ్లిక్స్ షోలో నటిస్తున్నాను’అని చెప్పింది. చివరిసారిగా 2022లో లవ్యూ లోక్ తంత్ర అనే హిందీ సినిమాలో నటించింది స్నేహ ఉల్లాల్.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u