MoviesTollywood news in telugu

Anjala Zaveri:అంజలా జావేరి భర్త చిరు,పవన్ సినిమాలో విలన్ మీకు తెలుసా..

Anjala Zaveri:తొలి సినిమాతోనే బంపర్‌ హిట్‌ అందుకున్న హీరోయిన్లలో అంజలా జవేరీ ఒకరు. వెంకటేష్‌ సరసన ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం​ ప్రేమించుకుందాం రా. ఈ సినిమా బంపర్‌ హిట్‌ కావడంతో అంజలా జవేరీకి వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో రెండో సినిమాతోనే అంజలాకు మెగాస్టార్‌ చిరంజీవితో జతకట్టే అవకాశం దక్కింది. 1998లో చిరంజీవి-జవేరీ నటించిన చూడాలని ఉంది సినిమా బంపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి.

తెలుగులో ఒకప్పుడు అంజలా జావేరి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె హిందీ రంగంలో మొదట సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన, అక్కడ పెద్దగా క్రేజ్ రాలేదు. దాంతో ఆమె చూపు టాలీవుడ్ మీద పడింది. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో తెలుగులో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. నాగార్జున,బాలకృష్ణ వంటి హీరోలతో జోడి కట్టిన ఆమెకు అనుకున్నంత క్రేజ్ రాలేదు.

ఆమెకు అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక పాత్ర పోషించింది. అదే తెలుగులో చివరి సినిమా.

ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమె ‘తరుణ్ అరోరా’ ను వివాహం చేసుకుంది. అతను కూడా హిందీ, తమిళ్ లో చాలా సినిమాల్లోనే నటించారు.

చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెం. 150 , పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు రెండు సినిమాల్లోనూ విలన్ గా నటించాడు. ఈ సినిమాల్లో మంచి పేరు సంపాదించాడు.

ఆయన జయ జానకి నాయక సినిమాలో కూడా విలన్ గా నటించాడు. తరుణ్ తన కెరీర్ ని 1999 లో ప్రారంభించిన ఖైదీ నెం. 150 తో బ్రేక్ వచ్చిందనే చెప్పాలి.
జయ జానకీ నాయకా, అమర్ అక్బర్ ఆంటోనీ, అర్జున్ సురవరం వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు తరుణ్ అరోరా. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ స్టైలిష్ విలన్. అంజలా జవేరి, తరుణ్ అరోరాకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తరుణ్ కెరీర్ మొదట మోడలింగ్‌తో స్టార్ట్ అయ్యింది. అందుకే ప్రతి సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తాడు. అది న‌ట‌న‌లోనూ క‌నిపించేలా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆ ప్రయ‌త్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన అంజలా జవేరీ.. 2012లో చివరగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో నటించింది. అంజ‌లా జ‌వేరీ ప్ర‌స్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. ఆమెకు త‌గ్గ క‌థ, పాత్ర వ‌స్తే వెంట‌నే ఓకే చెప్పటానికి సిద్దంగా ఉంది.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u