Health Tips:వీటిని ఇలా తీసుకుంటే కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు,అధిక బరువు,రక్తహీనత అనేవి ఉండవు
Health Care Tips : మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మన ఆరోగ్యం మీద మనం తీసుకునే ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి.
ఈ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. రాత్రి సమయంలో ఒక స్పూను శనగలు, ఒక స్పూను వేరుశెనగలు, 5 నల్ల కిస్మిస్ వేసి నీటిని పోసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన శనగలు, వేరుశనగలు,కిస్ మిస్ తింటూ ఆ నీటిని తాగాలి.
ఈ విధంగా చేయడం వలన వాటిలో ఉండే ప్రోటీన్స్,కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్, పొటాషియం వంటివి మన శరీరానికి అందుతాయి.ఈ విధంగా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కండరాల నొప్పులు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట, అజీర్తి వంటి అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి.
రక్తహీనత సమస్య కూడా ఉండదు. ఉదయం సమయంలో తీసుకోవడం వలన. నీరసం,నిసత్తువ,అలసట ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది.
నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.ఎందుకంటే నానబెట్టిన శనగల్లో ప్రోటీన్, సోడియం, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. నానబెట్టిన శనగలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
నానబెట్టిన శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా నానబెట్టిన శనగలు తినడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. నానబెట్టిన శనగలు ఆరోగ్యంతోపాటు జుట్టుకు కూడా పోషణ ఇస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టును బలంగా, అందంగా చేస్తాయి. నానబెట్టిన శనగలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
వేరుశనగను సామాన్యుడి జీడిపప్పు అని అంటూ ఉంటారు. ఇది పోషకాల స్టోర్‌హౌస్. పనిలో అలసిపోయినా, సత్తువ లేకపోయినా గుప్పెడు పల్లీలు తింటే.. తక్షణ శక్తి వస్తుంది. వేరుశనగలో లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇవి హెల్తీ స్నాక్స్‌లో ఒకటి. ఎముకల బలంగా ఉండటానికి, చర్మం ఆరోగ్యానికి, జుట్టు దృఢంగా ఉండటానికి ఈ పోషకాలు చాలా అవసరం.
ఇందులో చెక్కర అధికంగా ఉంటుంది. శరీరంలో షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. కానీ ఇందులో ఎక్కువగా కేలరీలు ఉండవు. ఫలితంగా బరువు తగ్గడానికి కూడా సహయపడుతుంది. ఇందులో ఐరన్, బి కాంప్లెక్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u