Beauty Tips

Turmeric For Face: ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది

Black sesame seeds And Turmeric Face Glow tips :ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవాలని మనలో చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కొంత మంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా ఉండదు. అలాగే ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతుంది.

ఈ సమస్యకు ఇంటిలోనే మంచి పరిష్కారం ఉంది. వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఒక స్పూన్ నల్ల నువ్వులను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ నువ్వుల పొడి,పావు స్పూన్ పసుపు వేసి కొంచెం నీటిని పోసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని మంగు మచ్చలు,నలుపు,తెలుపు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నల్ల నువ్వులలో ఉండే లక్షణాలు మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు మచ్చలను తొలగించి చర్మం ఆరోగ్యంగా అందంగా తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఈ మచ్చలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పడు చెప్పిన చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. పసుపును పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. అయితే మార్కెట్ లో దొరికే పసుపు కాకుండా పసుపు కొమ్ములను ఆడించిన పసుపు వాడితే మంచిది. ఎందుకంటే మార్కెట్ లో దొరికే పసుపులో కొన్ని కెమికల్స్ కలిసే అవకాశం ఉంది.

నల్ల నువ్వులలో విటమిన్ ఇ సమృద్దిగా ఉండుట వలన ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి, వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది మరియు సహజమైన గ్లోను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. నల్ల నువ్వులలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.

కాబట్టి కాస్త శ్రద్దగా ఈ చిట్కాను ఫాలో అయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లని అందమైన కాంతి వంతమైన ముఖాన్ని సొంతం చేసుకోండి. మరి ఇక ఆలస్యం ఎందుకు.. ఇప్పుడే ప్రారంభించండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u