Beauty Tips

Lice Remedies:తలలో పేలుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా సులభంగా వదిలించచ్చు…!

Home remedies for lice in telugu :తలలో పేను ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. భరించలేనంతగా దురద ఉంటుంది. వీటిని తొలగించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. పేలను తొలగించుకోవటానికి మార్కెట్ లో ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నాయి. అయితే వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

పేలు ఉండటం వలన జుట్టు రాలిపోతుంది. అలాగే తలలో కురుపులు,పుండ్లు పడే అవకాశం ఉంది. కాబట్టి పేలను సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలి. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

పేలు అనేవి చదువుకొనే పిల్లలో ఎక్కువగా కనిపిస్తాయి. జుట్టులో మురికి ఎక్కువ ఉన్నపుడు పేలు పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ పిల్లలకు జుట్టు శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. తలలో పేలు పట్టాయంటే ఒక పట్టాన తగ్గవు. విపరీతమైన దురద వస్తుంది.

జుట్టు ఎక్కువ సేపు తడిగా ఉండటం వలన కూడా పేలు చాలా వేగంగా పెరుగుతాయి. తడి మరియు చెమట కారణంగా పేలు పెరిగే అవకాశం ఉంది. చాలా మంది పేలను వదిలించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు

ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వేప ఆకులలో వెల్లుల్లి రెబ్బలను, కలబంద గుజ్జును వేసి కొంచెం నీటిని కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని వడకట్టి రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని తలకు అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

అలాగే ఆ తర్వాత చనిపోయిన పేలు, గుడ్లన్నింటినీ తొలగించడానికి పేల దువ్వెనతో దువ్వితే అవన్నీ బయటకు వచ్చేస్తాయంటున్నారు . ఇలా వారానికి ఒక సారి చేస్తే చాలా తక్కువ రోజుల్లోనే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. అయితే ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చాలా తొందరగా మంచి పలితాన్ని పొందవచ్చు.

అంతేకాదు.. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయని సూచిస్తున్నారు.పేలును వదిలించుకోవటానికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది అలాగే వేప నూనె కూడా పేలను తగ్గించుకోవటానికి సహాయపడుతుంది.

వేపలో అజాడిరాక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పేలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది మరియు వాటి గుడ్లు పొదుగడాన్ని కూడా నిరోధిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉండుట వలన పేలను తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

కలబందలో ఉన్న పోషకాలు పేలను తొలగించటానికి సహాయపడటమే కాకుండా చుండ్రు, జుట్టు రాలే సమస్యకు కూడా చెక్ పెడతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేలను చాలా సులభంగా తొలగించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u