Healthhealth tips in telugu

Betel leaf:ఒకే ఒక ఆకు శరీరంలో బలహీనత,రక్తహీనత,కీళ్ల నొప్పులు, కాల్షియం లోపం లేకుండా చేస్తుంది

Betel leaf health Benefits in Telugu : మన భారతదేశంలో తమలపాకును ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్ని భారతీయ వేడుకలలో తమలపాకు కీలకమైన పాత్ర ను పోషిస్తుంది. తమలపాకు అనగానే తాంబూలం గుర్తొస్తుంది. పూజలు, వ్రతాల్లో తమలపాకు తప్పనిసరిగా ఉంటుంది. దీనిని కేవలం పూజలకే కాదు. కొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేసేందుకు వాడొచ్చు

తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకులో విటమిన్ సి నియాసిన్ రిబోఫ్లావిన్ కెరోటిన్ విటమిన్స్,కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి తమలపాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తమలపాకులు.ను పేస్టుగా చేసుకొని నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది

అలాగే తమలపాకు రసం తాగిన శరీరం లోపల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో తమలపాకులు పెట్టి కట్టుకడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది శరీరంలో విషాలను బయటకు పంపుతుంది అలాగే తమలపాకు ఆకలి హార్మోన్లను పునరుద్ధరించి ఆకలి లేని వారిలో ఆకలి పెరిగేలా చేస్తుంది. నోటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

తమలపాకులు యాంటీబయటిక్ ప్రభావాలు. కలిగి ఉండటంవల్ల దగ్గు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా సహాయ పడుతుంది. తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే తొందరగా మంచి ఉపశమనం కలుగుతుంది . డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

మనం తమలపాకుల్ని నేరుగా నమిలి తీసుకోవచ్చు. తాజా ఆకుల్ని తీసుకుని నమిలితే నోటిలోని దుర్వాసన తగ్గటానికి సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు చిన్న తమలపాకును నమిలి తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీనిని నమలడం వల్ల సలైవా రిలీజ్ అవుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ స్టిమ్యులేట్ అయి జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

ఇందులో థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి, కెరోటిన్ వంటి గుణాలు మనకి చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది. వీటిని నేరుగా నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. నోటి దుర్వాసనతో బాదపడేవారు తమలపాకుల్ని తింటే చాలా మంచిది. దీంతో నోటి పుండ్లు రాకుండా కూడా ఉంటాయి.

తమలపాకుల్ని మనం జ్యూస్‌లా చేసుకుని తాగొచ్చు. దీని వల్ల మనకి శ్వాస సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో మనకి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటికి తమలపాకు జ్యూస్ చెక్ పెడుతుంది. అయితే, జ్యూస్‌లో పంచదార కలపకుండా తీసుకోవాలి. పంచదార లేకుండా తాగటానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం కొద్దిగా తేనె కలిపి తీసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు తేనే లేకుండా తీసుకుంటేనే మంచిది.

ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తమలపాకు తీగ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు మీకు కుదిరిన సమయంలో లేత తమలపాకు ఒకటి తింటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u