jaggery Benefits:2 రూపాయిల ఖర్చుతో కీళ్ల నొప్పులు,రక్తహీనత,అధిక బరువు జీవితంలో ఉండవు
jaggery benefits in telugu :స్వీట్ తింటే లావు అయిపోతామని.. షుగర్ వచ్చేస్తుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అయితే చక్కెరతో ప్రమాదం పొంచి ఉంది కానీ.. బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇదివరకటి రోజుల్లో స్వీట్లు తయారు చేయాలంటే బెల్లమే ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం స్వీట్స్ అంటే చక్కెరకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బెల్లం వాడితే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
స్వీట్స్ తినడం ఇష్టం లేనివారు మధ్యాహ్నం కానీ, రాత్రి భోజనం తరువాత కానీ చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలకు బెల్లం చెక్ పెడుతుంది. బెల్లం తినడం వల్ల జలుబు, దగ్గు, గ్యాస్, తలనొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం కలిపి తాగినా.. టీలో చక్కెర బదులు బెల్లం కలిపి తీసుకున్నా మంచిది.
శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపి లివర్ ను శుద్ధి చేసే అద్భుతమైన గుణం బెల్లంలో ఉంది. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. మహిళలు తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత నివారించవచ్చు. ఇన్ని సద్గుణాలున్న బెల్లంను రెగ్యులర్ డైట్ లో కాస్త చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా ప్రతి రోజు చిన్న బెల్లం ముక్క తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయ్యి తగ్గించుకోవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇలా ఇంటి చిట్కా ఫాలో అయితే తొందరగా మంచి ఫలితం ఉంటుంది.
ఈ మధ్య కాలంలో మలబద్దకం సమస్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈ సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు చిన్న బెల్లం ముక్క తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. అన్నీ వయస్సుల వారు బెల్లంను తినవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అది ఏమిటంటే ఆర్గానిక్ బెల్లం వాడాలి. కెమికల్స్ వాడిన పసుపు రంగు బెల్లం వాడకూడదు. ఆర్గానిక్ బెల్లం ముదురు రంగులో ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ బెల్లం అని నకిలీ బెల్లం ఎక్కువగా కనపడుతుంది. బెల్లం కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నకిలీ బెల్లం తింటే ఎన్నో రాకల సమస్యలు వస్తాయి. చిన్న బెల్లం ముక్క తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఏదైనా మితంగా తింటేనే కదా.. ప్రయోజనాలు కలిగేది..
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u