Hibiscus Tea:వారంలో 2 సార్లు ఈ టీ తాగితే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు
Mandara Tea Benefits In telugu :మారిన జీవనశైలి పరిస్థితి మరియు శారీరక శ్రమ లేకపోవటం,వంశపారంపర్యంగా కొలస్ట్రాల్ సమస్య అనేది వస్తుంది. కొలస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొలస్ట్రాల్ తగ్గించుకోవటానికి మన ఇంటిలో ఉండే మందరపువ్వు కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
ప్రతి ఇంట్లో కనిపించే మందార మొక్కలో ఎన్నో ఔషధ విలువలు దాగి వున్నాయి. మందార పూలు వాడి ఔషధ టీ తయారుచేస్తారు. మందార పువ్వులోని ఆకర్షణ పత్రాలను నీటిలో బాగా కడిగి ముందుగా మరగపెట్టిన పాలు లేదా టీలో వేసి ఆ టీ రంగు మారేదాకా వేచి ఉండి అప్పుడు తాగాలట. దీంతో అందులోని పలు రకాల పోషక పదార్థాలు, అధిక శాతం ఐరన్, విటమిన్లు మేలు చేస్తాయట. ఈ టీ తాగితే హైపర్ టెన్షన్ తగ్గుతుందట. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుందట. అలాగే రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుందట.
మందార టీ, షుగర్ జబ్బున్న వారికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో యాంటీఆక్సిడెంట్ల వల్ల కాలేయ ఆరోగ్యం కాపాడుతుందట. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. డిప్రెషన్‌కి గురయ్యే వారికి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువును నియంత్రించడంలో బహిష్టు నొప్పుల నివారణలోనూ మందార టీ ఔషధంగా పనిచేస్తుందట.
ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్లను తగ్గించి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన మీ శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి మరియు ఆక్సీకరణ ఒత్తిడి మరియు నష్టాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఈ టీ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఈ టీని క్రమం తప్పకుండా తాగితే పొత్తికడుపు కొవ్వు మరియు శరీర బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. జీర్ణక్రియకు కూడా బాగా సహాయపడుతుంది. కాల్షియం స్ఫటికాలు కిడ్నీ స్టోన్స్‌గా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ టీ కోసం తాజా మందార పువ్వును ఉపయోగించవచ్చు. లేదంటే మార్కెట్ లో ఎండిన మందార పువ్వు రేకలు లభ్యం అవుతాయి. అంతేకాక మందార పువ్వుల పొడి కూడా లభ్యం అవుతుంది.
ఈ టీని వారంలో రెండు లేదా మూడు సార్లు తాగాలి. ఈ టీని తయారుచేసుకోవటానికి కాస్త సమయాన్ని కేటాయించి ఇప్పుడు చెప్పిన అన్నీ ప్రయోజనాలను పొందండి. మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u