Rasi Phalalu:November 28 రాశి ఫలాలు… ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ…మీ రాశి ఉందా…?
November 28 Rasi Phalalu in Telugu : జాతకాలను కొంత వరకు నమ్మవచ్చు. అయితే గుడ్డిగా నమ్మకూడదు.మనలో చాలా మంది జాతకాలను విపరీతంగా నమ్ముతూ ఉంటారు. జాతకం ప్రకారం అడుగులు వేస్తూ ఉంటారు. జాతకాలను నమ్మేవారు ప్రతి రోజు వారి నక్షత్రం ప్రకారం వారి రాశి గురించి తెలుసుకుంటూ ఉంటారు. కొంత మంది రాశి ఫలాలను అనుసరించి పనులను కూడా చేస్తూ ఉంటారు.
మేష రాశి
ఈ రాశి వారు చేసే పనులలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి
ఈ రాశి వారు అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది.
మిధున రాశి
ఈ రాశి వారు అనవసర ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేసే పని మీద ఎక్కువగా శ్రద్ద పెట్టాలి.
కర్కాటక రాశి
ఈ రాశి వారు చేసే పనులలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. కాస్త జాగ్రత్తగా పనులను చేసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
సింహరాశి
ఈ రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కన్యా రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తులారాశి
ముఖ్యమైన పనులలో మంచి పురోగతి సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధికమిస్తారు. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహానికి గురిచేస్తాయి. పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు గొప్ప ఫలితాలను అందిస్తాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది.
మకర రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అలసట కూడా ఎక్కువగానే ఉంటుంది. తోటి వారి సహాయంతో పనులను పూర్తి చేస్తారు.
కుంభరాశి
ఈ రాశి వారు ఏ పని చేసిన అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కలహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశం లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ కాస్త ఎక్కువగా పెడితే విజయాన్ని సాధిస్తారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.